Venkatesh: సర్ ప్రైజ్: కొత్త వ్యాపారం మొదలు పెట్టిన వెంకటేష్ !

Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మొత్తానికి బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇక భవిష్యత్తు మొత్తం విద్యుత్ ఆధారిత వాహనాలదే. కేంద్రప్రభుత్వం కూడా విద్యుత్ ఆధారిత వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే పెట్రోల్ ధరలు కూడా తగ్గిస్తోంది. ఈ నేపథ్యంలో, వెంకటేష్ కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లకు విద్యుత్ చార్జింగ్ సదుపాయం కల్పించే ‘బైక్ వో’ సంస్థలో పెట్టుబడులు పెట్టి పార్ట్నర్ అయ్యాడు. పైగా ‘బైక్ వో’ సంస్థలో కేవలం […]

Written By: Neelambaram, Updated On : January 11, 2022 3:47 pm
Follow us on

Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మొత్తానికి బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇక భవిష్యత్తు మొత్తం విద్యుత్ ఆధారిత వాహనాలదే. కేంద్రప్రభుత్వం కూడా విద్యుత్ ఆధారిత వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే పెట్రోల్ ధరలు కూడా తగ్గిస్తోంది. ఈ నేపథ్యంలో, వెంకటేష్ కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లకు విద్యుత్ చార్జింగ్ సదుపాయం కల్పించే ‘బైక్ వో’ సంస్థలో పెట్టుబడులు పెట్టి పార్ట్నర్ అయ్యాడు.

Venkatesh:

పైగా ‘బైక్ వో’ సంస్థలో కేవలం భాగస్వామ్యంగా మాత్రమే కాకుండా.. ఆ సంస్థకు వెంకటేష్ ప్రచారకర్తగానూ వ్యవహరించబోతున్నాడు. నిజంగా ఇది తెలివైన నిర్ణయం. భవిష్యత్తులో విద్యుత్ ఆధారిత వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని గత కొన్ని రోజులుగా బిజినెస్ నిపుణులు కూడా చెబుతూ వస్తున్నారు. ఏ బిజినెస్ కి అయితే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందో.. ఆ బిజినెస్ ను మొదట స్టార్ట్ చేసే వ్యక్తికి ఎక్కువ లాభాలు ఉంటాయి.

Also Read:  సినిమా వాళ్ళు “బలిసి” కొట్టుకోవడం లేదు. “భయం” తో.. బతుకు జీవుడా అంటున్నారు !

ఈ విషయంలో వేంకటేష్ ఒక అడుగు ముందే ఉన్నాడు. అయితే, ఈ ఆలోచన వెనుక సురేష్ బాబు ఉన్నాడని తెలుస్తోంది ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లకు విద్యుత్ చార్జింగ్ సదుపాయం కల్పించే ‘బైక్ వో’ అనే సంస్థలో వెంకటేష్ పెట్టుబడులు పెట్టాడు అనగానే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అందుకే, పెట్టుబడులు తాను పెట్టినా.. సురేష్ బాబు మాత్రం వెంకటేష్ కొత్త వ్యాపారం షురూ చేశాడు అంటూ పబ్లిక్ లో హైలైట్ చేస్తున్నాడు. ఇక ఈ ‘బైక్ వో’ సంస్థలో మరో రాజకీయ నాయకుడికి కూడా భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది.

Also Read: ఛార్మిని ఆటపట్టించిన బాలయ్య.. చూసి తీరాల్సిందే..!

Tags