https://oktelugu.com/

Tollywood Crazy Gossips: వైరల్ అవుతున్నటాలీవుడ్ టుడే క్రేజీ గాసిప్స్ !

Tollywood Crazy Gossips: ఈ రోజు టాలీవుడ్ లో కొత్తగా వినిపిస్తున్న క్రేజీ గాసిప్స్ గురించి.. సినిమాల అప్‌డేట్స్ గురించి.. సంక్షిప్తంగా క్లాసిక్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమాలో ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉందని.. ఆ పాత్రలో హీరో రాజశేఖర్‌ నటించబోతున్నాడు అని ఓ రూమర్ బాగా వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాలో ఓ అతిధి పాత్రలో హీరో సల్మాన్‌ నటిస్తున్నాడు. చిరుతో కలసి నటించే ఆ సీన్ల […]

Written By: , Updated On : January 11, 2022 / 03:37 PM IST
Follow us on

Tollywood Crazy Gossips: ఈ రోజు టాలీవుడ్ లో కొత్తగా వినిపిస్తున్న క్రేజీ గాసిప్స్ గురించి.. సినిమాల అప్‌డేట్స్ గురించి.. సంక్షిప్తంగా

క్లాసిక్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమాలో ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉందని.. ఆ పాత్రలో హీరో రాజశేఖర్‌ నటించబోతున్నాడు అని ఓ రూమర్ బాగా వైరల్ అవుతుంది.

Tollywood Crazy Gossips

Koratala Shiva and Jr NTR

మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాలో ఓ అతిధి పాత్రలో హీరో సల్మాన్‌ నటిస్తున్నాడు. చిరుతో కలసి నటించే ఆ సీన్ల కోసం సల్మాన్ జనవరి చివర్లో డేట్స్ ఇచ్చాడట.

Tollywood Crazy Gossips

Chiranjeevi and Salman Khan

Also Read: ఛార్మిని ఆటపట్టించిన బాలయ్య.. చూసి తీరాల్సిందే..!

రాజశేఖర్‌ హీరోగా నటించిన 91వ చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివానీ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజశేఖర్, శివానీల స్టిల్స్‌ని చిత్రబృందం విడుదల చేసింది. వారి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు జీవితా రాజశేఖర్. త్వరలో సినిమా విడుదల తేదీని వెల్లడిస్తామన్నారు.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘సెల్యూట్’ విడుదల వాయిదా పడింది. ‘మిమ్మల్ని నిరాశకు గురి చేస్తున్నందుకు క్షమించండి. కానీ ఇలాంటి కొవిడ్ పరిస్థితుల్లో మాకు ప్రజల భద్రత ముఖ్యం. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం’ అని చిత్ర నిర్మాణ సంస్థ వెల్ఫేర్ ప్రకటించింది. ఈ మూవీకి రోషన్ ఆండ్రూస్ డైరెక్టర్ కాగా డయానా పెంటీ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల విడుదలైన సెల్యూట్ ట్రైలర్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అందుకే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ‘హీరో’లో కృష్ణ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!

Tags