Raja Saab Advance Bookings: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజాసాబ్'(Raja Saab Movie) చిత్రం వచ్చే నెల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ గ్రాండ్ గా మొదలు అయ్యాయి. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి ‘సహానా..సహానా’ పాట విడుదలైంది. హైదరాబాద్ లోని లుల్లూ మాల్ లో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఈ పాటని విడుదల చేశారు. నిధి అగర్వాల్ ఈ ఈవెంట్ కి రావడం, తిరిగి వెళ్తున్నప్పుడు అభిమానులు ఆమెని చుట్టుముట్టి ఇబ్బంది పెట్టడం, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గానే ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి ‘రాజా సాబ్’ మూవీ ప్రొమోషన్స్ చేసింది. అంతే కాకుండా ఈ ఆదివారం జరగబోయే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ప్రభాస్ ముఖ్య అతిథిగా కూడా రాబోతున్నాడు అట.
ఇలా రాజా సాబ్ కి నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ చిత్రానికి రావాల్సిన హైప్, క్రేజ్ మాత్రం ఇంకా రాలేదు అనే చెప్పాలి. నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టి రెండు వారాలు అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం $121K డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ మాత్రమే వచ్చింది. వెయ్యి కి పైగా షోస్ ని షెడ్యూల్ చేసినా ఇంత తక్కువ గ్రాస్ రావడాన్ని చూసి అక్కడి ట్రేడ్ పండితులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కల్కి చిత్రం తో మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ ని కేవలం ప్రీమియర్ షోస్ నుండి రాబట్టిన ప్రభాస్ కి, ఇప్పుడు కనీసం 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా ప్రీమియర్స్ నుండి రావడం చాలా కష్టమైన విషయం గా మారిపోయింది.
కేవలం ప్రభాస్ విషయం లో మాత్రమే కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఈ ఏడాది ఇలాంటివే జరిగాయి. రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కేవలం 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే ప్రీమియర్ షోస్ నుండి వచ్చాయి. అదే విధంగా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి $800K డాలర్లు ప్రీమియర్ షోస్ నుండి వచ్చాయి. ఇదే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం రెండు నెలల తర్వాత విడుదలై ప్రీమియర్ షోస్ నుండి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబట్టింది. దీన్ని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆడియన్స్ ని ఆకర్షించే ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వకపోతే, తమ జోబు నుండి నయా పైసా తియ్యడానికి కూడా ఇష్టం చూపడం లేడు ఆడియన్స్. రాజాసాబ్ నుండి చాలా కంటెంట్ వచ్చింది, కానీ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత డల్ గా ఉన్నాయి.