India Vs South Africa 5th T20: అహ్మదాబాద్ లో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది.. భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్లో టీమిండియా 30 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ విజయంతో సూర్య కుమార్ ఆధ్వర్యంలో టీమిండియా స్వదేశం వేదికగా మరో ట్రోఫీని అందుకుంది.
ఈ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. టీమిండియాలో సంజు శాంసన్ 37, అభిషేక్ శర్మ 34, తిలక్ వర్మ 73, హార్దిక్ పాండ్యా 63 పరుగులు చేసి అదరగొట్టారు.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (5) మరోసారి నిరాశపరిచాడు.. ఈ టోర్నీలో అతడు సారధిగా మెప్పించినప్పటికీ.. ఆటగాడిగా విఫలమవుతున్నాడు.
232 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఘనంగా ప్రారంభించింది.. క్వింటన్ డికాక్ ఆకాశమే హద్దుగా చెలగిపోయాడు.. బూమ్రా మినహా మిగతా అందరి బౌలర్ల బౌలింగ్లో దుమ్మురేపాడు. డికాక్ 36 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 65 పరుగులు చేశాడు.. ఇతడికి బ్రేవిస్ కూడా తోడు కావడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ రాకెట్ వేగంతో వెళ్లిపోయింది. బ్రేవిస్ 17 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 31 పరుగులు చేశాడు.. డికాక్ తో పాటు ఓపెనర్ గా వచ్చిన హెన్రిక్స్ విఫలమయ్యాడు.. డికాక్, బ్రేవిస్ పోటీపడి పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా ఒకానొక దశలో ఇండియా పై పై చేయి సాధించింది. 10 ఓవర్లలోనే 120 పరుగులు పూర్తి చేసింది.. లక్ష్యం దిశగా సాగింది.
దక్షిణాఫ్రికా స్కోర్ 120 పరుగుల వద్ద ఉన్నప్పుడు 10.2 ఓవర్ లో అద్భుతం జరిగింది.. బుమ్రా వేసిన బంతిని స్ట్రైట్ కవర్ డ్రైవ్ ఆడేందుకు డికాక్ ప్రయత్నించాడు. ఆ బంతిని బుమ్రాన్ అత్యంత జాగ్రత్తగా అందుకోవడంతో అతడు అవుట్ కాక తప్పలేదు.. ఇక ఇక్కడి నుంచి మ్యాచ్ వరకు పూర్తిగా మారిపోయింది.. బ్రేవిస్ కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ పట్టిన క్యాచ్ తో వెనక్కి వెళ్ళక తప్పలేదు. అప్పటిదాకా పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డ భారత బౌలర్లు.. వికెట్లు తీయడం మొదలుపెట్టారు.. మిల్లర్ (19), కెప్టెన్ మార్క్రామ్ (5), ఫెరీర (0), జార్జిలిండే(16), యాన్సన్(14), బాష్(17) విఫలం కావడంతో భారత జట్టు విజయం ఖాయమైంది. ఒకానొక దశలో భారత్ కంటే మెరుగ్గా పరుగులు చేసిన దక్షిణాఫ్రికా.. చివరి ఏడు వికెట్లు 57 పరుగుల వ్యవధిలో కోల్పోవడంతో.. భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది.