Virata Parvam Pre Release Event: విరాటపర్వం మూవీ విడుదలకు సిద్ధం కాగా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు. విరాటపర్వం ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన అబ్బాయి రానాపై ప్రశంసలు కురిపించాడు. ఇక సాయి పల్లవిని ప్రత్యేకంగా పొగిడారు. విరాటపర్వం చిత్ర దర్శకుడితో పాటు కీలక పాత్రలు చేసిన ప్రియమణి, ఈశ్వరి రావు, నవీన్ చంద్రలను అభినందించారు. విరాటపర్వంలో విక్టరీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వెంకటేష్ మాట్లాడుతూ… అభిమానులందరికీ నమస్కారం. సినిమాపై ఇష్టం విరాటపర్వం ప్రీ రిలీజ్ వేడుకకు నేను వచ్చేలా చేసింది. ‘మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే’ వంటి డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి . రానా ఏ సినిమా చేసినా సబ్జెక్ట్ ను చాలా శ్రద్ధగా ఎంచుకుంటాడు. రానాను ఈ విషయంలో అభినందించాల్సిందే. ఇక విరాట పర్వం సినిమా ట్రైలర్ చూసినప్పుడే పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. ఒక్కో సీన్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.
Also Read: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పెద్ద పొరపాటు చేస్తున్నాడా..?
రానా నువ్వు ఎప్పటికైనా సక్సెస్ అవుతావు. ఆల్రెడీ నువ్వు సక్సెస్ రూట్ లోనే ఉన్నావు. మెల్లగా ఎదిగినా కచ్చితంగా భవిష్యత్ నీదే. ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన నిజాయితీ గల ఫిల్మ్ మేకర్ వేణు ఉడుగుల. ఆయన డెడికేషన్ నాకు బాగా నచ్చింది. విరాట పర్వం రైటింగ్, విజువల్స్, ప్రొడక్షన్ బాగున్నాయి. ప్రియమణి, ఈశ్వరీ, నవీన్ చంద్ర అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించనుంది.

ఇక నాకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. ఆ క్యూట్ స్మైల్ చాలు, ఎవరైనా పడిపోవాల్సిందే. ముఖ్యంగా ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాతో సాయి పల్లవి నేషనల్ అవార్డు అందుకోవడం గ్యారంటీ. అలాగే సినిమా కోసం పనిచేసిన ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ కు మరోసారి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. జూన్ 17 నుండి థియేటర్లలో విరాటపర్వం సందడి మొదలుకానుంది. సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాను, అంటూ వెంకటేష్ ముగించారు. కాగా రానా-వెంకటేష్ కాంబినేషన్ లో ”రానా నాయుడు” పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలో నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. హాలీవుడ్ సిరీస్ రే డొనోవన్ కి ఇది అధికారిక రీమేక్.
ఇక విరాటపర్వం మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read:Vakeel Saab Director: వకీల్ సాబ్ డైరెక్టర్ పరిస్థితి పాపం ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?


[…] Also Read: Virata Parvam Pre Release Event: రానా నువ్వు సక్సెస్ రూట్ … […]