Producer Dil Raju Into The TRS Party: TRS పార్టీలోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఎక్కడి నుండి పోటీ చెయ్యబోతున్నాడో తెలుసా?

Producer Dil Raju Into The TRS Party: ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ 1 నిర్మాత ఎవరు అనే ప్రశ్న అడిగితే మన అందరికి కామన్ గా గుర్తుకు వచ్చే పేరు దిల్ రాజు..నైజాం ప్రాంతం లో ఒక్క చిన్న పంపిణీదారుడిగా ప్రారంభం అయిన దిల్ రాజు కెరీర్ నేడు ఏ స్థానం లో ఉందొ మనం మన కళ్లారా చూస్తున్నాము..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన తొలిప్రేమ సినిమా నైజం హక్కులను […]

Written By: Neelambaram, Updated On : June 16, 2022 11:05 am
Follow us on

Producer Dil Raju Into The TRS Party: ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ 1 నిర్మాత ఎవరు అనే ప్రశ్న అడిగితే మన అందరికి కామన్ గా గుర్తుకు వచ్చే పేరు దిల్ రాజు..నైజాం ప్రాంతం లో ఒక్క చిన్న పంపిణీదారుడిగా ప్రారంభం అయిన దిల్ రాజు కెరీర్ నేడు ఏ స్థానం లో ఉందొ మనం మన కళ్లారా చూస్తున్నాము..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన తొలిప్రేమ సినిమా నైజం హక్కులను దిల్ రాజు అప్పట్లో కొనుగోలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ఆయన కెరీర్ ని ఒక పెద్ద మలుపు తిప్పింది..అలా డిస్ట్రిబ్యూటర్ గా అంచలంచలుగా ఎదుగుతూ నిర్మాతగా మారి స్టార్ హీరోలతో ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి నేడు ఇండస్ట్రీ లోనే నెంబర్ నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నాడు దిల్ రాజు..వ్యాపార రంగం లో ఆరితేరిన దిల్ రాజు ద్రుష్టి ప్రస్తుతం రాజకీయాల వైపు మరలుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త.

Dil Raju

Also Read: AB Venkateswara Rao: జగన్ తో ఫైట్.. అతడే గెలిచాడు..

దిల్ రాజు గత సార్వత్రిక ఎన్నికలలోనే TRS పార్టీ నుండి MLA గా పోటీ చేద్దాం అనుకున్నాడు..అప్పట్లో ఈ విషయమై ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి KCR తో చర్చలు జరిపాడు కూడా..కానీ ఎందుకో ఆ చర్చలు ఫలించినట్టు లేదు..చివరి క్షణం లో డ్రాప్ అయ్యాడు..కానీ ఇప్పుడు TRS పార్టీ నుండే దిల్ రాజు కు వచ్చే ఎన్నికలలో నిజామాబాద్ నుండి పోటీ చెయ్యమని ఆహ్వానం అందింది అట..దిల్ రాజు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది..అయితే ఆయన నిజామాబాద్ నుండి MLA గా పోటీ చేయబోతున్నారా..లేదా MP గా పోటీ చేయబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది..ఇక దిల్ రాజు ఇటీవలే ఆయన నిర్మాతగా వ్యవహరించిన F3 సినిమా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో పాటుగా ఆయన తన 50 వ చిత్రాన్ని సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్నాడు..కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు..ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ని ఈ ఏడాది లోగ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి దింపితే బాగుంటుందని అనుకుంటున్నారట దిల్ రాజు గారు..ఇక డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు ప్రస్తుత కాలం అద్భుతంగా కలిసి వస్తుంది..ఇటీవల ఆయన నైజం ప్రాంతం లో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన భీమ్లా నాయక్, అఖండ, #RRR మరియు KGF చాప్టర్ 2 వంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు కి మంచి లాభాలను తెచ్చిపెట్టింది..అలా నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా మంచి సక్సెస్ లను చూస్తున్న దిల్ రాజు కి పాలిటిక్స్ కూడా అదే రేంజ్ సక్సెస్ ని చూపిస్తుందో లేదో చూడాలి.

KCR, Raju

Also Read: Karnataka Honour killing: పరువు కోసం కుమార్తె ప్రాణాలనే తీశారు.. అసలేం జరిగిందంటే?

Tags