https://oktelugu.com/

Hrithik Roshan: ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం నాకు అగ్ని పరీక్ష లాంటిది అంటూ హృతిక్ రోషన్ షాకింగ్ కామెంట్స్!

తెలుగోడి సత్తా చాటుతూ ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి మళ్ళీ అదే ఫీట్ ని రిపీట్ చేయబోతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 14, 2025 / 04:00 PM IST

    Hrithik Roshan

    Follow us on

    Hrithik Roshan: ఇండియా లో ప్రస్తుతం తరం సూపర్ స్టార్స్ లో అద్భుతంగా డ్యాన్స్ వేసే హీరోల లిస్ట్ తీస్తే మనకి హృతిక్ రోషన్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఎంత క్లిష్టమైన స్టెప్పుని అయినా ఈ నలుగురు హీరోలు అతి తేలికగా వేసేయగలరు. హృతిక్ రోషన్ డ్యాన్స్ లో గ్రేస్ + స్పీడ్ ఉంటుంది. అదే విధంగా రామ్ చరణ్ డ్యాన్స్ లో గ్రేస్, ఎన్టీఆర్ డ్యాన్స్ లో స్పీడ్, అల్లు అర్జున్ డ్యాన్స్ లో స్పీడ్ + స్టైల్ వంటి అంశాలు కనిపిస్తాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి అద్భుతమైన డ్యాన్సర్లు కలిసి ఒకే పాటలో నర్తిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు వస్తాయి #RRR లోని ‘నాటు నాటు’ సాంగ్ చూసినప్పుడే అందరికీ అర్థమైంది. తెలుగోడి సత్తా చాటుతూ ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి మళ్ళీ అదే ఫీట్ ని రిపీట్ చేయబోతున్నారు.

    వీళ్లిద్దరు కలిసి ఆయన ముఖర్జీ దర్శకత్వం లో ‘వార్ 2’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్ ఉన్న రోల్ లో కనిపించనున్నాడు. దేశం కోసం పోరాడే యోధుడిగా ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే ఎన్టీఆర్, ఆ తర్వాత దేశానికీ శత్రువు అవుతాడు. అతను అలా మారడానికి గల కారణాలు ఏమిటి అనేది ఈ చిత్రం లో చాలా ఆసక్తికరంగా చూపించబోతున్నాడు డైరెక్టర్. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే హృతిక్ రోషన్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ‘ఈ సినిమాలో డైరెక్టర్ ఒక నాకు, ఎన్టీఆర్ కి మధ్య ఒక అద్భుతమైన డ్యాన్స్ నెంబర్ ని పెట్టాడు. ఎన్టీఆర్ తో పోటీ పడి డ్యాన్స్ వేయడం అనేది చిన్న విషయం కాదు. నా కాళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారింది.

    వీళ్లిద్దరి మధ్య సాంగ్ మాత్రమే కాదు, పోరాట సన్నివేశాలు కూడా వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి. ఆగస్టు 14 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కానీ అది సాధ్యం అవ్వడం కష్టమని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. సినిమాలో అనేక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి అవసరం ఉందని, అంత తొందరగా పూర్తి అయ్యే అవకాశాలు లేవని తెలుస్తుంది. ఆగష్టు నెల మిస్ అయితే క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని దింపే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. క్రిస్మస్ కి విడుదలయ్యే సినిమాలకు రికార్డు స్థాయి వసూళ్లు రావడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఓవర్సీస్ లో కూడా సెలవులు లభిస్తాయి కాబట్టి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే విధంగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అనుకోవచ్చు.