Venkatesh- Ravi Teja: టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టార్ర్ర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఏడాది విడుదలైన బిగ్గెస్ట్ మల్టీస్టార్ర్ర్ చిత్రం #RRR సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించడం తో మలిస్టార్ర్ర్ సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు..ఈ మల్టీస్టార్ర్ర్ మూవీ ట్రెండ్ కి ముందుగా ఆజ్యం పోసింది విక్టరీ వెంకటేష్ గారే..ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి తొలిసారిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా తీసాడు..ఈ సినిమాకి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల..అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించింది..ఈ సినిమా తర్వాత వెంకటేష్ చాలా ముల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసాడు..ఇటీవలే ఆయన వరుణ్ తేజ్ తో కలిసి చేసిన మల్టీస్టార్ర్ర్ సినిమా F3 విడుదలై భారీ విజయం సాధించింది..ఇప్పుడు ఆయన మాస్ మహారాజ రవితేజ తో మల్టీస్టార్ర్ర్ సినిమా చెయ్యబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది..ఈ సినిమాకి కూడా శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అవ్వడం విశేషం.
కొత్త బంగారు లోకం, ముకుంద మరియు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల..ఆ తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన బ్రహ్మోత్సవం సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల అడ్రస్ లేకుండా పొయ్యాడు.
Also Read: Basavatarakam Hospital: బాలయ్య బసవతారకం హాస్పిటల్ కు మరో అరుదైన రికార్డ్
చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన విక్టరీ వెంకటేష్ తో నారప్ప అనే సినిమా తీసాడు..డైరెక్టుగా OTT లో విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా క్రెడిట్ మొత్తం వెంకటేష్ కి వెళ్ళింది..ఎందుకంటే ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ అయినా అసురన్ అనే సినిమాకి రీమేక్ కాబట్టి..ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల త్వరలో తియ్యబోయ్యే వెంకటేష్ మరియు రవితేజ మల్టీస్టార్ర్ర్ తో తనని తానూ ప్రూవ్ చేసుకునే విధంగా స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది..కామెడీ టైమింగ్ లో తిరుగులేని హీరోలుగా పేర్లు తెచ్చుకున్న ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా తెలియచెయ్యబోతున్నట్టు సమాచారం.
Also Read:Telugu Heroine: ఆ క్రికెటర్ ప్రేమలో తెలుగు హీరోయిన్.. ఫోటో వైరల్ !