Basavatarakam Hospital: స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తన భార్య బసవతారకం గారి జ్ఞాపకార్థం ‘బసవ తారకం కాన్సర్ హాస్పిటల్’ ని స్థాపించారు..అప్పటి ప్రధాని మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ ఈ హాస్పిటల్ ప్రారంభోత్సం కి హాజరయ్యారు..ఎన్టీఆర్ గారి తదనంతరం ఈ హాస్పిటల్ బాధ్యతలు అన్ని నందమూరి బాలకృష్ణ గారు చేపడుతున్నారు..ఈ హాస్పిటల్ స్థాపించి నేటి 22 ఏళ్ళు పూర్తి చేసుకోగా నిన్న ఈ హాస్పిటల్ లో 22 వ వార్షికోత్సవ వేడుకలు జరిపారు..ఈ వేడుకలకు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మరియు ఖమ్మం జిల్లా ఎంపీ నామా నాగేశ్వరరావు గార్లు ముఖ్య అతిధులుగా హాజరై బసవతారకం హాస్పిటల్ గురించి అలాగే నందమూరి బాలకృష్ణ గారి గురించి గొప్పగా మాట్లాడారు..ఈ హాస్పిటల్ అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు..అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘ 100 పథకాలతో ప్రారంభమైన ఈ హాస్పిటల్..నేడు 600 పడకల హాస్పిటల్ గా అభివ్రుది చెందింది..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ ద్వారా అత్యధిక చికిత్సలు అందించిన ఏకైక హాస్పిటల్ మా బసవ తారకం హాస్పిటల్..భవిష్యత్తులో ఇంకా ఎంతో మంది పేదలకు చికిత్స అందించేందుకు మా వంతు కృషి మేము చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య బాబు.
మరో విశేషం ఏమిటి అంటే బసవ తారకం కాన్సర్ హాస్పిటల్ దేశం లోనే ది బెస్ట్ కాన్సర్ హాస్పిటల్ గా రెండవ స్థానం లో కొనసాగుతుంది..ఇది చైర్మన్ గా బాలయ్య గారికి మాత్రమే గర్వకారణం కాదు..ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన విషయం..అత్యధిక సాంకేతిక విలువలతో..దేశం లోనే బెస్ట్ డాక్టర్స్ అందరూ కూడా ఈ బసవతారకం హాస్పిటల్ లో పని చేస్తున్నారు..నటుడిగా, MLA గా మరియు బసవ తారకం హాస్పిటల్ చైర్మన్ గా ఆయన అందిస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయం..చూడడానికి మనిషి కఠినంగా కనిపించినప్పటికీ కూడా ఆయన మనసు వెన్న లాంటిదని ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలు చూసి చెప్పొచ్చు.
Also Read: Senior Hero Naresh: తన నాల్గవ పెళ్లి గురించి తొలిసారి స్పందించిన నరేష్
ఇది ఇలా ఉండగా బాలయ్య బాబు కి నిన్న కరోనా సోకినట్టు వచ్చిన వార్తలు ఆయన అభిమానులను కంగారు పెడుతోంది..నలుగురికి మంచి చేసే బాలయ్య బాబు ని చల్లగా చూసి తొందరగా కోలుకునేలా చెయ్యాలని ఆయన అభిమానులు దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు..ప్రస్తుతం ఆయన క్వారంటైన్ లో ఉంటున్నారు..అఖండ వంటి సంచలన విజయం సాధించిన తర్వాత ఆయన గోపీచంద్ మలినేని తో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ సమయం లోనే బాలయ్య బాబు కి కరోనా సోకినట్టు తెలుస్తుంది.
Also Read:Telugu Heroine: ఆ క్రికెటర్ ప్రేమలో తెలుగు హీరోయిన్.. ఫోటో వైరల్ !