https://oktelugu.com/

Venkatesh : వెంకటేష్ కథల విషయం లో కేర్ తీసుకుంటున్నాడా..?

Venkatesh : ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోకి ఏదో ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. కొంతమంది కొన్ని మాస్ సినిమాలు మాత్రమే చేస్తే, మరి కొంతమంది ఎక్స్పర మెంటల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఇంకొంతమంది ఫ్యామిలీ సినిమాలను చేస్తుంటారు. ఇక ఇలాంటి సందర్భంలో వెంకటేష్ లాంటి హీరో అటు ఫ్యామిలీ, ఇటు మాస్ తో పాటు ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. ఏ పాత్రలో అయిన అలవోకగా నటించి మెప్పించగలిగే కెపాసిటి వెంకటేష్ కి మాత్రమే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : March 16, 2025 / 02:02 PM IST
    Venkatesh

    Venkatesh

    Follow us on

    Venkatesh  : మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో విక్టరీ వెంకటేష్…తన కెరియర్ మొదట్లో అడపాదడపా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగాడు. ఇక ఎప్పుడైతే ‘బొబ్బిలి రాజా’ (Bobbili Raja) సినిమా వచ్చిందో అప్పటి నుంచి ఆయన కెరియర్ టాప్ గేర్ లో ముందుకు దూసుకెళ్లింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తున్నాడు. రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి సీనియర్ హీరోలందరి కంటే తను ముందు వరుసలో ఉన్నానని తన తోటి హీరోలకు సవాల్ విసిరాడు. ఇక ఇలాంటి నేపధ్యంలోనే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే సగటు ప్రేక్షకులు అందరూ కూడా ఆ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. మరి వెంకటేష్ కి రీసెంట్ గా మంచి విజయం దక్కింది.

    Also Read : విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ మూవీపై క్రేజీ న్యూస్… వర్క్ అవుట్ అయితే మరో బ్లాక్ బస్టర్!

    కాబట్టి ఇక మీదట వచ్చే సినిమాలు సక్సె ను సాధించాలి తప్ప, ఫెయిల్యూర్ గా మిగలకూడదనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఆయన చాలా స్క్రిప్ట్ లను వింటున్నప్పటికి అందులో ఏ స్క్రిప్ట్ కూడా ఫైనల్ చేయలేకపోతున్నారట. ఇక మరికొన్ని స్క్రిప్ట్ లను విని ఏదో ఒక సినిమాకి డిసైడ్ అవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దర్శకుడు చెబుతున్న కథలేవి తనకు పెద్దగా నచ్చడం లేదంటూ కొన్ని వార్తలు కూడా వెలువడుతున్నాయి.

    మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ లాంటి నటుడు చాలా అరుదుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా నటించి మెప్పించగలిగే కెపాసిటి ఉన్న హీరో… అలాగే ఇతర హీరోలతో గొడవలు పెట్టుకోవడం ఈగోలు ఉంచుకోవడం లాంటివి ఏది కూడా అతని డిక్షనరీలో లేదనే చెప్పాలి.

    అందుకే వెంకటేష్ అంటే ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా అతని సినిమాలు చూస్తూ ఉంటారు. మరి ఇకమీదట చేయబోయే సినిమాతో భారీ విజయాలను సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకోసమే మంచి కథలను ఎంచుకోవడానికి కొంత ఎక్కువ సమయాన్ని తీసుకున్న పర్లేదు కానీ ఫెయిల్యూర్ సినిమాలను మాత్రం చేయకూడదనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…

    Also Read : కన్నప్ప ప్రమోషన్స్ లో పాల్గొననున్న ప్రభాస్…మంచు విష్ణు మామూలుగా ప్లాన్ చేయడం లేదుగా.