https://oktelugu.com/

AR Rahman : AR రెహమాన్ కి ఛాతి నొప్పి..హాస్పిటల్ కి తరలించిన కుటుంబ సభ్యులు..ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే!

AR Rahman : నేడు ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లింది కూడా కొడుకే. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన సంగీత దర్శకత్వం వహించిన 'చావా' చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెహమాన్ మరోసారి తన అద్భుతమైన సంగీతం తో ఈ సినిమాకి కొత్త ఊపిరి పోశాడు.

Written By:
  • Vicky
  • , Updated On : March 16, 2025 / 02:05 PM IST
    AR Rahman Health Issue
    Follow us on

    AR Rahman : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు(Oscar Award) గ్రహీత AR రెహమాన్(AR Rahman) కి ఈరోజు ఉదయం ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడం మొదలైంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స చేస్తుంది. ఈ వార్త తెలియగానే దేశం లో ఉన్నటువంటి కోట్లాది మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేసారు. AR రెహమాన్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ ఆరాలు తీశారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని, హాస్పిటల్ వర్గాలు అధికారికంగా ఒక బులిటెన్ ని విడుదల చేసింది. దీంతో అభిమానులు శాంతించారు. ఇటీవల కాలం లోనే ఆయన తన భార్య తో విడాకులు తీసుకున్న సంఘటన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం AR రెహమాన్ తన కొడుకుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు.

    Also Read : ఎన్టీయార్ ను మూడు రోజులు ఉపవాసం ఉంచిన ప్రశాంత్ నీల్…కారణం ఏంటంటే..?

    నేడు ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లింది కూడా కొడుకే. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘చావా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెహమాన్ మరోసారి తన అద్భుతమైన సంగీతం తో ఈ సినిమాకి కొత్త ఊపిరి పోశాడు. ఇప్పుడు ఆయన రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చాలా కాలం తర్వాత తెలుగు లో రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఆయన సంగీతం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సౌత్ లో ప్రస్తుతం అనిరుద్, తమన్ వంటి సంగీత దర్శకుల మేనియా నడుస్తున్నప్పటికీ బుచ్చి బాబు AR రెహమాన్ ని ఎంచుకున్నాడంతే ఈ సినిమాకు ఆయన ఎంత అవసరమో అర్థం అవుతుంది. ఇప్పటికే నాలుగు పాటలు కంపోజ్ కూడా చేశారట.

    రెహమాన్ తనయుడు అమీన్(AR Ameen) కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా అనేక సూపర్ హిట్ సినిమాలకు పని చేశాడు. తెలుగు లో ఇప్పటి వరకు ఆయన ఒక్క సినిమాకు కూడా పని చేయలేదు కానీ, హిందీ, తమిళ భాషల్లో మాత్రం చాలా సినిమాలకే పని చేశాడు. అంతే కాకుండా AR రెహమాన్ సంగీతం అందించే సినిమాల్లో ఈయన పాటలు కూడా పాడాడు. కానీ ఎందుకో తండ్రి స్థాయిలో మాత్రం పేరు ప్రఖ్యాతలు ఇప్పటి వరకు సంపాదించుకోలేదు. తండ్రి నీడలోనే ఎదుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సంగీతం రూపొందించిన సినిమాలకంటే, తండ్రి సినిమాల్లో పాడిన పాటలే ఎక్కువ. కేవలం రెహమాన్ సినిమాల్లోనే ఆయన పాటలు పాడుతున్నడు. మిగిలిన సంగీత దర్శకులు ఎందుకో అమీన్ ని అంతగా గుర్తించడం లేదు. భవిష్యత్తులో అయినా ఆయన తండ్రి స్థాయిలో ఎదుగుతాడో లేదో చూడాలి.

    Also Read : రజినీకాంత్ జైలర్ 2 సినిమాలో క్యామియో రోల్ పోషిస్తున్న తెలుగు స్టార్ హీరో..