https://oktelugu.com/

Kannappa: కన్నప్ప ప్రమోషన్స్ లో పాల్గొననున్న ప్రభాస్…మంచు విష్ణు మామూలుగా ప్లాన్ చేయడం లేదుగా…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కి విలక్షణ నటుడిగా చాలా మంచి గుర్తింపైతే ఉంది.తన కొడుకు అయిన మంచు విష్ణు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

Written By: , Updated On : March 16, 2025 / 10:43 AM IST
Kannappa (1)

Kannappa (1)

Follow us on

Kannappa: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే యంగ్ హీరోలు మంచి కథతో పాన్ ఇండియా సినిమాలను చేస్తూ భారీ విజయాలను సాధిస్తుంటే స్టార్ హీరోలు సైతం ఇండస్ట్రీ హిట్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు… ఇక ఇప్పటికే ప్రభాస్ లాంటి స్టార్ హీరో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు…

Also Read: విక్రమ్ మాస్ విశ్వరూపం.. దుమ్ములేపేసిన ‘వీర ధీర సూర’ టీజర్.. ఈసారి గురి తప్పేలా లేదు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కి విలక్షణ నటుడిగా చాలా మంచి గుర్తింపైతే ఉంది.తన కొడుకు అయిన మంచు విష్ణు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఆయన ఎంటైర్ కెరియర్ లో ఢీ (Dhee) సినిమాను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ లను సాధించలేకపోయాయి. ఇక ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లాలని ఎప్పటికప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నప్పటికి అవి ఏవి కూడా అంత మంచి క్రేజ్ ను అయితే తీసుకొచ్చి పెట్టడం లేదు. ఇంకా దాంతో 150 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప(Kannappa) అనే మూవీని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక కీలకపాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవ్వడానికి ప్రభాస్ ఒక ముఖ్య కారణమనే చెప్పాలి. మరి ఇప్పటివరకు ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ప్రభాస్ పాల్గొనబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

నిజానికి ప్రభాస్ కి, మోహన్ బాబు కి మధ్య మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు బావ, బావ అని పిలుచుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రభాస్ మంచు విష్ణు సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించాడు. తద్వారా ఈ సినిమా మీద బజ్ భారీ రేంజ్ లో పెరిగిపోయింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుంది.

తద్వారా ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఒకవేళ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మంచి విష్ణు కెరియర్ అనేది ఒక్కసారిగా టర్న్ అయిపోతుందనే చెప్పాలి. ఓవర్ నైట్ అని పాన్ ఇండియా హీరోగా మారిపోతాడు. అలా కాకుండా బోల్తా కొడితే మాత్రం ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయే అవకాశం కూడా ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

 

Also Read:  మహేష్ , రాజమౌళి మూవీ సెట్స్ లో హోలీ ఆడిన హీరోయిన్ ప్రియాంక చోప్రా..వైరల్ అవుతున్న ఫోటోలు!