Venkatesh: ప్రస్తుతం ఉన్న హీరోలందరు వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక అందులో కొందరు హీరోలు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తే, మరికొందరికి మాస్ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఇంకొందరు యూత్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలా వివిధ ఏజ్ గ్రూపులను టార్గెట్ చేస్తూ సినిమాలను చేస్తున్న మన హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం సూపర్ సక్సెస్ ను సాధించారు. ప్రస్తుతంతెలుగు సినిమా స్థాయి భారీ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది కాబట్టి ఇప్పటివరకు ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు దక్కించుకుంటుండటం విశేషం… ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలలో వెంకటేష్ సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఈ సంవత్సరం ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో గొప్ప విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘ఆదర్శ కుటుంబం’ అంటూ మరోసారి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలను చేసినప్పటికి తను మాత్రం మంచి సినిమాలను చేసి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం సీనియర్ హీరోలందరిలో వెంకటేష్ ముందు వరుసలో ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ప్రస్తుతం సీనియర్ హీరోల్లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.
మిగతా సీనియర్ హీరోలందరు 300 కోట్ల మార్కును టచ్ చేయలేకపోయారు. 150 కోట్లు 200 కోట్లు దగ్గరే వాళ్ళు ఆగిపోవడంతో వెంకటేష్ ముందంజలో ఉన్నాడు… వెంకటేష్ కెరియర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆయన చేసిన సినిమా అతనికి పెద్ద షాక్ తగిలించింది. మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇక వెంకటేష్ సైతం ఈ సినిమా ఎందుకు చేశానా అంటూ చాలా సందర్భాల్లో బాధపడ్డాడు…
ఇక అప్పటినుంచి అలాంటి సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాడట…కథ బాగుండి దాన్ని స్క్రీన్ మీద సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేయగలిగే దర్శకులకు మాత్రమే డేట్స్ ఇవ్వాలని వెంకటేష్ నిర్ణయించుకున్నాడట. షాడో సినిమా ఎఫెక్ట్ రెండు మూడు సంవత్సరాల పాటు తన కెరీర్ మీద పడిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…