KCR: తెలంగాణలో గత బీఆర్‌ఎస్ సర్కార్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. ఇటీవలే దీనిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రెండేళ్లు గడిచినా ఏమీ తేల్చలేదు అన్న చర్చ జరుగుతున్న సమయంలో పభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విచారణ వేగతంతం చేసేలా ఏకంగా మాజీ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు జారీ చేయనుందని విశ్వసనీయ సమాచారం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు వెల్లడించిన వివరాలతో..
స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ ప్రధాన అధికారి ప్రభాకర్ రావు విచారణలో ముఖ్య రాజకీయ నాయకుల ఫోన్ సంభాషణలను రహస్యంగా ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన ఈ కార్యకలాపాలు ప్రముఖ వ్యక్తులపై దృష్టి సారించాయని, దీనికి ఉన్నత స్థాయి అధికారుల సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఈ విషయాలను వివరంగా తెలిపినట్లు సమాచారం.
అసెంబ్లీ సెషన్ తర్వాత చర్యలు..
హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ఎస్‌ఐటీ, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేసీఆర్‌తోపాటు, ఇతరులకు అధికారికు నోటీసులు పంపనుంది. ఈ నోటీసులు వారిని విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తాయి. ఎస్‌ఐటీ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు 20కి పైగా వ్యక్తులను ఇదిపించిన నేపథ్యంలో ఈ చర్య ఆసక్తి కలిగిస్తోంది.
రాజకీయ ప్రతిస్పందనలు..
ఈ వ్యవహారం 2024లో ఎస్‌ఐబీ ఆఫీస్‌లో జరిగిన దాడి, అక్రమ ట్యాపింగ్ ఆధారాల సేకరణతో మొదలైంది. బీఆర్‌ఎస్ నేతలు ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా తీసుకొని తిరుగుబాటు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి, పారదర్శక దర్యాప్తు హామీ ఇచ్చింది. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనలు, గోప్యతా ఉల్లంఘనలపై దృష్టి పెట్టిన ఈ దర్యాప్తు మరిన్ని సంచలనాలకు దారి తీసే అవకాశం ఉంది.
సిట్ త్వరలో మరిన్ని సాక్ష్యాలు సేకరించనుంది. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని రాసే అవకాశం ఉంది. అధికారిక ప్రకటనల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.