Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా జానర్ ని తెలుపుతూ అనిల్ రావిపూడి తన కామెడీ టైమింగ్ ని జోడించి విడుదల చేసిన వీడియో కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో కళ్లారా చూశాము. అంతే కాదు సంగీత దర్శకుడిని కూడా చాలా విన్నూత రీతిలో ప్రకటించారు. జీవీ ప్రకాష్ కుమార్ , అనంత్ శ్రీరామ్ లను వైజాగ్ బీచ్ లోని ఇసుక లో పూడ్చేసి , వాళ్ళతో అనిల్ రావిపూడి మ్యూజిక్ సిట్టింగ్స్ వేయడం చాలా ఫన్నీ గా అనిపించింది. ఇకపోతే నిన్న గాక మొన్ననే షూటింగ్ మొదలైనట్టు అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుందట.
ఈ విషయాన్ని కాసేపటి క్రితమే మూవీ టీం , చాలా క్రియేటివ్ గా ఒక వీడియో ద్వారా అధికారికంగా తెలిపారు. ‘లెట్ మీ డ్రైవ్.. లెఫ్ట్ టు ది రైట్ ..స్ట్రెయిట్ టు వ్రాప్’ అనే పదాలతో ఒక ట్యూన్ కట్టి , దాన్ని ఈ వీడియో కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడడమే కాకుండా , హీరోయిన్ కృతి శెట్టి , కీర్తి సురేష్ లతో పాటు , సినిమాలో నటించే నటీనటులతో హుక్ స్టెప్పులు వేయిస్తూ , చాలా ఫన్నీ గా ఈ వీడియో ని క్రియేట్ చేశారు అనిల్ రావిపూడి. అడుగడుగునా ఆయన మార్క్ టేకింగ్ కనిపించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ప్రొమోషన్స్ విషయం లో ఒక సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి , ఎందుకో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు ప్రొమోషన్స్ విషయం లో సైలెంట్ అయ్యారు.
కానీ ఇప్పుడు చేస్తున్న చిత్రానికి ఆయన ప్రొమోషన్స్ షూటింగ్ ప్రారంభ దశ నుండే మొదలు పెట్టారు. ఇప్పుడే ఇలా ఉంటే , ఇక సినిమా విడుదల దగ్గర పడిన తర్వాత ప్రొమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తారో మీరే ఊహించుకోండి. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ మేకింగ్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Swinging left to right…
and signing off the first schedule in blockbuster style ❤️Team #VenkyANIL5 – #NKRAR2 has successfully wrapped up an exciting first schedule, canning some absolute fun-filled and entertaining sequences
SANKRANTHI 2027 RELEASE
Victory… pic.twitter.com/hZSbi4gTv1
— Shine Screens (@Shine_Screens) July 23, 2026






