Venkatesh And Trivikram Adarsha Kutumbam: ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడంలో వెంకటేష్ ముందు వరుసలో ఉంటాడు. ఒకప్పుడు శోభన్ బాబు ఎలాగైతే ఫ్యామిలీ సినిమాలను చేసి ప్రేక్షకులను అట్రాక్ట్ చేశాడో ఆ తర్వాత వెంకటేష్ ఆ బాధ్యతను తీసుకొని అదే తరహాలో సినిమాలను చేస్తూ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమాలు ఎవరు చేసిన కూడా ప్రేక్షకులు ఆ సినిమాలో ఆ హీరో సెట్ అవ్వలేదు. దానికి వెంకటేష్ అయితేనే బాగుంటాడు అనే ఒక సర్టిఫికెట్ ఇచ్చే అంత రేంజ్ లో అతను ఫ్యామిలీ సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు… వెంకటేష్ సినిమాల్లో కామెడీ చాలా ఎక్కువగా ఉంటుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ ,’మల్లీశ్వరి’ లాంటి సినిమాలు వెంకటేష్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాలుగా నిలిచాయి. ఇక అలాంటి కాంబినేషన్లో ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా రాబోతోంది. మొదటిసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ ను డైరెక్ట్ చేస్తుండటం విశేషం…వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఎప్పటినుంచో చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ అది ఇప్పటికి వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సంవత్సరం ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ తీరాలకు చేరుతుందా? వెంకటేష్ మరోసారి ఫ్యామిలీ సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ అన్ని సినిమాల్లో ఏదో ఒక సీను గాని, స్టోరీని గాని కాపీ చేశాడు అంటూ వార్తలైతే వస్తుంటాయి. ఇక ఈ సినిమాలో సైతం క్లైమాక్స్ బాలీవుడ్ సినిమా అయిన ‘గోల్ మాల్’ సినిమా నుంచి కాపీ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి… ఇందులో ఎంతవరకు నిజం ఉంది నిజంగానే త్రివిక్రమ్ కాపీ చేశాడా? లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ చేయడానికి సన్నాహాలు