Akkineni Amala : లెజెండరీ ప్రొడ్యూసర్ డి. రామనాయకుడు కుమారుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు వెంకటేష్. కెరీర్ బిగినింగ్ లో విజయాల కోసం వెంకటేష్ ఒకింత ఇబ్బంది పడ్డాడు. ప్రేమ, బొబ్బిలిరాజా, క్షణ క్షణం, చంటి, కూలీ నెంబర్ వన్ చిత్రాలు ఆయనకు స్టార్డం తెచ్చాయి. వెంకటేష్ కి విజయాల శాతం ఎక్కువ. ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, పెళ్లి చేసుకుందాం వంటి చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఆయన్ని దగ్గర చేశాయి.
విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ పలువురు హీరోయిన్స్ తో నటించారు. సౌందర్య, మీనా వంటి నటులతో ఎక్కువ సినిమాలు చేశారు. అయితే వెంకటేష్ వరసకు చెల్లి అయ్యే హీరోయిన్ తో జతకట్టడం విశేషం. ఆ నటి ఎవరో కాదు అక్కినేని అమల. నాగార్జున సతీమణి అయిన అమల వెంకటేష్ కి వరసకు చెల్లి అవుతుంది.
వెంకటేష్ సిస్టర్ దగ్గుబాటి లక్ష్మిని అక్కినేని నాగార్జున వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ వైవాహిక జీవితం అనంతరం నాగార్జున-లక్ష్మి విడిపోయారు. అప్పటికి నాగ చైతన్య సంతానంగా ఉన్నాడు. లక్ష్మితో విడాకుల తర్వాత నాగార్జున హీరోయిన్ అమలతో ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. నాగార్జునను వివాహం చేసుకున్నాక అమల యాక్టింగ్ కి గుడ్ బై చెప్పింది.
పెళ్ళికి ముందు అమల పలువురు స్టార్స్ తో జతకట్టింది. వారిలో వెంకటేష్ ఒకరు. వెంకటేష్-అమల కాంబినేషన్ లో రెండు చిత్రాలు వచ్చాయి. ఒకటి రక్త తిలకం కాగా, మరొకటి అగ్గి రాముడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయితే నాగార్జునకు భార్య అవుతుందని తెలియని వెంకటేష్ ఆమెతో సినిమాలు చేశాడు. అనుకోకుండా అమల నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ విధంగా అమల వెంకటేష్ కి చెల్లి అయ్యిందన్న మాట.
నిజానికి అమలతో వెంకటేష్ కి ఎలాంటి చుట్టరికం లేదు. అమల బెంగాలీ ఫాదర్, ఐరిష్ మదర్ కి పుట్టిన అమ్మాయి. నటిగా తెలుగు, తమిళ భాషల్లో ఆమె రాణించారు. నాగార్జునకు జంటగా శివ, కిరాయి దాదా, నిర్ణయం, ప్రేమ యుద్ధం, చినబాబు చిత్రాల్లో నటించింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ప్రస్తుతం అమల క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. అవి కూడా ఆచితూచి చాలా అరుదుగా చిత్రాలు ఒప్పుకుంటుంది. అమల పెట్ లవర్, సోషల్ వర్కర్.
ఇక అమల-నాగార్జునల కుమారుడు అఖిల్ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు. ఓ సాలిడ్ హిట్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అఖిల్ గత చిత్రం ఏజెంట్ నిరాశపరిచింది.