https://oktelugu.com/

అవును.. వెంకటేష్ ఫీలింగ్ కరెక్టే !

బాలీవుడ్ లో ఆ మధ్య మంచి విజయాన్ని అందుకున్న ‘దే దే ప్యార్ దే’ సినిమా యొక్క రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అప్పుడే దక్కించుకున్నాడు. కానీ సినిమాని మొదలుపెట్టలేదు. ఈ ఏడాది చేయాలనుకంటే కరోనా వచ్చింది. అయితే వచ్చే ఏడాది అయినా ఈ సినిమాని ఎవరితో చేయాలి అనే మీమాంసలో ఉన్నాడట సురేష్ బాబు. నిజానికి ఈ రీమేక్ ను మొదట వెంకటేష్ తో చేయాలని అనుకున్నారు. వెంకీ కూడా మొదట్లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 21, 2020 / 06:56 PM IST
    Follow us on


    బాలీవుడ్ లో ఆ మధ్య మంచి విజయాన్ని అందుకున్న ‘దే దే ప్యార్ దే’ సినిమా యొక్క రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అప్పుడే దక్కించుకున్నాడు. కానీ సినిమాని మొదలుపెట్టలేదు. ఈ ఏడాది చేయాలనుకంటే కరోనా వచ్చింది. అయితే వచ్చే ఏడాది అయినా ఈ సినిమాని ఎవరితో చేయాలి అనే మీమాంసలో ఉన్నాడట సురేష్ బాబు. నిజానికి ఈ రీమేక్ ను మొదట వెంకటేష్ తో చేయాలని అనుకున్నారు. వెంకీ కూడా మొదట్లో ఈ ప్రాజెక్ట్ పట్ల సుముఖంగానే ఉన్నాడు. కానీ ప్రస్తుతం వెంకీ ఈ సినిమా చేయాలా వద్దా అనే సందేహంలో ఉన్నాడట.

    Also Read: పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !

    వెంకీ ఇలా సందేహా పడటానికి కారణం నాగర్జున చేసిన ‘మన్మథుడు 2’ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడమేనని.. ఆ సినిమాలో నాగార్జున తన వయసులో సగం వయసున్న అమ్మాయిను ప్రేమించడం అనే కాన్సెప్ట్ ను ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. పైగా వల్గర్ కామెడీ అంటూ ఆ సినిమాని తిప్పి కొట్టారు. ఆ సినిమాలో రొమాంటిక్ హీరో అనే ఇమేజ్ ఉన్న నాగర్జుననే ప్రేక్షకులు చూడలేకపోయారంటే.. ఇక అలాంటి టైప్ కథలో.. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నన్ను చూస్తారా.. అని వెంకటేష్ డౌట్. ఒకవేళ చూసినా.. ఈ వయసులో నేను రొమాంటిక్ రోల్స్ చేయడం అవసరమా అని వెంకటేష్ ఈ సినిమా పట్ల అయిష్టత చూపిస్తున్నాడట.

    Also Read: ముప్పై దాటాక గాని అర్ధం కాలేదు !

    వెంకటేష్ ఫీలింగ్ కరెక్టే. ఎందుకంటే ‘దే దే ప్యార్ దే’ కథ కూడా దగ్గర దగ్గర ‘మన్మథుడు 2’ మాదిరిగానే సాగుతోంది. పైగా ఆ కథలో కుటుంబ ప్రేక్షకులు తనను చూస్తారా అని వెంకీ సందేహిస్తునట్లుగానే.. ఖచ్చితంగా చూడకపోవచ్చు. సహజంగానే ఇలాంటి సినిమాలకు మన తెలుగు ప్రేక్షకులు కాస్త దూరంగా ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం ‘వెంకీ’ అసురన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత వెంకీ తరుణ్ భాస్కర్, త్రినాథరావ్ నక్కినతో సినిమాలు చేయాల్సి ఉంది.