https://oktelugu.com/

Sharwanand: సరిగ్గా ఏడాది అయ్యింది..అప్పుడే విడాకులు..చిక్కుల్లో పడ్డ హీరో శర్వానంద్ వైవాహిక జీవితం!

సమంత - నాగ చైతన్య, ఐశ్వర్య - ధనుష్, శ్రీజా - కళ్యాణ్ దేవ్, నిహారిక - చైతన్య ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ హీరో శర్వానంద్ కూడా చేరిపోతున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 15, 2024 / 12:19 PM IST

    Sharwanand

    Follow us on

    Sharwanand: ఈమధ్య కాలంలో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అసలు ఎందుకు ప్రేమించుకుంటున్నారో, ఎందుకు డేటింగ్ చేస్తున్నారో, ఎందుకు విడిపోతున్నారో సామాన్యులకు అర్థం కానీ పరిస్థితి. పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థ రోజు రోజు దిగజారిపోతుండడం చూస్తుంటే భవిష్యత్తులో పెళ్లి అనే సంప్రదాయం ఉంటుందా అనే భయం కలుగుతుంది. బలమైన కారణాల వల్ల విడిపోవడం వేరు, చిన్న చిన్న కారణాలతో విడిపోవడం వేరు. ఇప్పుడు ఒక భార్య భర్త మధ్య రెండు మూడు సార్లు గొడవ జరిగితే నేరుగా విడాకులు తీసుకునే వరకు వెళ్తున్నాయి వ్యవహారాలు. ఈమధ్య కాలం లోనే ఎంతో మంది సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం మనం చూసాం.

    సమంత – నాగ చైతన్య, ఐశ్వర్య – ధనుష్, శ్రీజా – కళ్యాణ్ దేవ్, నిహారిక – చైతన్య ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ హీరో శర్వానంద్ కూడా చేరిపోతున్నాడు. అదేంటి?, శర్వానంద్ కి రక్షిత రెడ్డి అనే అమ్మాయితో సరిగ్గా ఏడాది క్రితం పెళ్లి అయ్యింది, ఈమధ్యనే ఆడబిడ్డకు జన్మని కూడా ఇచ్చారు, కలిసి సంతోషంగా తిరుగుతున్న సందర్భాలు కూడా మనం సోషల్ మీడియా లో ఎన్నో చూసాము, అంత అన్యోయంగా ఉన్న దంపతులు అకస్మాత్తుగా ఎందుకు విడిపోతున్నారు అని మీలో వంద సందేహాలు కలిగి ఉండొచ్చు. కానీ శర్వానంద్ విడాకులు తీసుకుంటున్నది నిజ జీవితం లో కాదు, రీల్ లైఫ్ లో. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘సామజ వరాగమనా’ అనే చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న డైరెక్టర్ అబ్బరాజు తో శర్వానంద్ రీసెంట్ గానే ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమా మొత్తం విడాకుల నేపథ్యంలో సాగుతుందట. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు ప్రేమికుల జీవితం లో ఏర్పడిన కొన్ని అనుకోని సమస్యల కారణంగా విడాకులు తీసుకుంటారు. ఆ తర్వాత వీరి మధ్య చోటు చేసుకున్న సంఘటనలను ఆధారంగా తీసుకొని, దాంపత్య జీవితం ఎంత పవిత్రమైనదో, పెళ్లి అనే వ్యవస్థ ఎంత ఉత్తమమైనదో ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ అబ్బరాజు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాడట. సంయుక్త మీనన్, సాక్షి వైద్య ఈ చిత్రం లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. అబ్బరాజు మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటుగా,ఎమోషనల్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

    ఇకపోతే శర్వానంద్ గత కొంతకాలం నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. రీసెంట్ గా ఆయన నుండి విడుదలైన ‘మనమే’ అనే చిత్రం ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియని పరిస్థితి. ఆడియన్స్ లో శర్వానంద్ సినిమా అంటే ఒక బ్రాండ్ ఉండేది. ఇప్పుడు ఆ బ్రాండ్ మసకబారింది. ఒకప్పుడు నాని తో సరిసమానమైన మార్కెట్ ని మైంటైన్ చేస్తూ వచ్చిన శర్వానంద్, ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోల రేంజ్ లో కూడా రాణించలేకపోతున్నాడు. అబ్బరాజు తో తియ్యబోయే ఈ సినిమాతోనైనా బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.