నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వి’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయగా…తాజాగా మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు వి మూవీలోని ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ లిరికల్ వీడియో విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించిన ఈపాటను శ్రేయ ఘోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి కలిసి పాడారు.