
13 వ తేదీ శుక్రవారం రిలీజ్ కానున్న 6 సినిమాల వివరాలు .
1. అర్జున
నట్టి ఎంటర్ టైన్ మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రాజకీయ నేపథ్యంలో “అర్జున” మూవీ రూపొందింది. మరియం జకారియా హీరోయిన్ కాగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఈ మూవీ లో హీరో రాజశేఖర్ తండ్రీ కొడుకులుగా నటించడం విశేషం.
2. యురేక
లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో కార్తీక్ ఆనంద్, షాలిని జంటగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “యురేక ” మూవీ రూపొందింది. బ్రహ్మాజీ, రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. నరేష్ కుమరన్ సంగీతం అందించారు.
https://www.youtube.com/watch?v=CIvx_mol5Lw
3.ప్రేమ పిపాసి
రాహుల్ భాయ్ మీడియా, దుర్గా శ్రీ ఫిల్మ్స్, పి ఎస్ రామకృష్ణ సంయుక్తంగా నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేమ పిపాసి మూవీ కి మురళి రామస్వామి దర్శకుడు. కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ ప్రధాన పాత్రలలో నటించారు. ఆర్, ఎస్ సంగీతం అందించారు.
4. 302
డ్రీమ్ ట్రీ మీడియా బ్యానర్ పై కార్తికేయ మిరియాల దర్శకత్వంలో భవికా దేశాయ్ ప్రధాన పాత్రలో క్రైమ్, సస్పెన్స్, హారర్, కామెడీ అంశాలతో “302 ” మూవీ రూపొందింది. వెన్నెల కిషోర్, రవి వర్మ, విజయ సాయి, తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రఘురామ్ సంగీతం అందించారు.
5 . శివన్
యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా శివన్. సాయి తేజా కల్వకోట, తరుణి సింగ్ హ…
సింగ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం శివన్, నిర్మాత సంతోష్ రెడ్డి ఎల్. ఈ సినిమా మార్చి 13న విడుదలకానున్నది.
https://www.youtube.com/watch?v=0qyQnSMQ-58
6 . బగ్గిడి గోపాల్
మాస్టర్ చేతన్ రెడ్డి , మాస్టర్ నితిన్ రెడ్డి సమర్పణ లో బగ్గిడి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన “బగ్గిడి గోపాల్” మూవీ కి అర్జున్ కుమార్ దర్శకుడు. బగ్గిడి గోపాల్ నిజ జీవిత సంఘటనలతో రూపొందిన ఈ మూవీ లో రమాకాంత్, సిరిచందన, సుమన్, కవిత, ప్రభావతి ముఖ్య తారాగణం. జయసూర్య బి సంగీతం అందించారు.