Matka Poster Release: భిన్నమైన సబ్జక్ట్స్ ఎంచుకోవడంలో వరుణ్ తేజ్ ముందుంటారు. ఆయన కెరీర్ పరిశీలిస్తే రకరకాల జోనర్స్ ట్రై చేశారు. ఈసారి వరుణ్ తేజ్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ వైపు మొగ్గు చూపారు. మట్కా టైటిల్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. పలాస మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. నేడు హైదరాబాద్ లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మట్కా పూజా సెరిమోనీకి చిత్ర యూనిట్, పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు.
మట్కా కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంది. కాగా మట్కా మూవీ గురించి కీలక సమాచారాన్ని చిత్ర యూనిట్ షేర్ చేశారు. మట్కా వైజాగ్ నేపథ్యంలో నడిచే పీరియాడిక్ డ్రామా. 1958 నుండి 82 వరకు 24 సంవత్సరాల మధ్య జరిగిన కథ. వాస్తవ సంఘటనల ఆధారంగా రోపొందిస్తున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ పరిశీలిస్తే క్రైమ్ డ్రామా అనిపిస్తుంది. వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్స్ లో దర్శనమిస్తారట.
వరుణ్ తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. 60ల కాలం నాటి ఓ సెట్ కూడా ఏర్పాటు చేశారట. అక్కడ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కనున్నాయట. వరుణ్ తేజ్ కి జంటగా ఖిలాడి ఫేమ్ మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
వరుణ్ తేజ్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా మట్కా ఐదు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాంఢీవదారి అర్జున టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠి దర్శకత్వంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఆగస్టులో వీరి వివాహం అంటూ ప్రచారం జరుగుతుంది. అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
A dawn of a whole new world ❤️🔥
Our Production No.2, #VT14 Titled as #MATKA 🎬
In Telugu, Tamil, Hindi, Kannada & Malayalam💥@IAmVarunTej @KKfilmmaker #Norafatehi @Meenakshiioffl @gvprakash @PriyaSeth18 @mohan8998 @drteegala9 @Naveenc212 @ashishtejapuala @Rkjana11 @sunny4u007… pic.twitter.com/mAAWxRWVPD
— Vyra Entertainments (@VyraEnts) July 27, 2023