Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల అవ్వగా, దానికి అభిమానుల నుండి , ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ మరింత ఊపు అందుకుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ పూర్తి అయ్యింది. హిందీ లో కూడా అన్ని సింగిల్ స్క్రీన్స్ ని బుక్ చేసేసుకున్నారు. కనీవినీ ఎరుగని రేంజ్ లో హిందీ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. అయితే ఫ్యాన్సీ రేట్లకు ఈ సినిమాని కొనుగోలు చేసారు కాబట్టి, టికెట్ రేట్స్ కూడా అదే రేంజ్ లో పెట్టాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏమేరకు సోషల్ మీడియా లో నిన్నటి నుండి ఒక ప్రచారం సాగుతుంది.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మల్టీప్లెక్స్ థియేటర్స్ కి 500 రూపాయిలు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి 300 రూపాయిల టికెట్ రేట్స్ పెట్టాలని ఆలోచిస్తున్నారట. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి కోసం లేఖ రాయబోతున్నట్టు తెలుస్తుంది. నైజాం ప్రాంతం లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. కాబట్టి మొదటి రోజు 30 కోట్ల రూపాయిల షేర్ ని, అదే విధంగా మొదటి వారంలో 60 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టే ఆలోచనలో ఈ టికెట్ రేట్స్ ని రిక్వెస్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే రేంజ్ టికెట్ రేట్స్ కోసం దరఖాస్తు చేయబోతున్నారట. ఒక్క సీడెడ్ ప్రాంతంలోనే ఈ సినిమా 30 కోట్ల రూపాయిల నాన్ రీ-ఫండబుల్ అమౌంట్ కి అమ్ముడుపోయిందట.
అదే విధంగా క్రింది స్థాయిలో ఎక్సిబిటర్లకు బయ్యర్స్ 40 కోట్ల రూపాయిల బిజినెస్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదంతా రికవరీ అవ్వాలంటే కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ లో నైజాం స్థాయిలో రేట్స్ పెట్టాలని అనుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ ఏది కోరితే అది చేయడానికి సిద్ధం గా ఉండడంతో, వాళ్ళు కూడా మేకర్స్ అడిగిన వెంటనే టికెట్ రేట్స్ కి అనుమతి ఇస్తారని ఆశిస్తున్నారు అభిమానులు. ఒకవేళ అన్ని ప్లాన్ ప్రకారం జరిగితే ఈ సినిమాకి మొదటి రోజే 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. బాలీవుడ్ లో కూడా మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు.