https://oktelugu.com/

Varun Tej Lavanya Tripathi : బిగ్ బ్రేకింగ్ : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి అధికారిక ప్రకటన

మెగా హీరో వరుణ్ తేజ్ కొణిదెల తను ప్రేమించిన లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యాడు. తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు. జూన్ 9వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న ప్రైవేట్ వేడుకలో ఈ జంట ఉంగరాలు మార్చుకోనున్నట్లు అధికారిక సమాచారం.

Written By:
  • NARESH
  • , Updated On : June 8, 2023 / 11:42 AM IST
    Follow us on

    Varun Tej Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ ఎట్టకేలకు బయటపెట్టాడు. తను ప్రేమించిన హీరోయిన్ నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇన్నాళ్ల కట్టుబాట్లు.. అడ్డంకులు.. కుటుంబం ఒత్తిడిని అధిగమించి ఎట్టకేలకు పెళ్లికి రెడీ అయ్యాడు.

    మెగా హీరో వరుణ్ తేజ్ కొణిదెల తను ప్రేమించిన లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యాడు. తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు. జూన్ 9వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న ప్రైవేట్ వేడుకలో ఈ జంట ఉంగరాలు మార్చుకోనున్నట్లు అధికారిక సమాచారం.

    నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు , సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. “రెండు హృదయాలు, ఒక ప్రేమ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ & లావణ్య త్రిపాఠి అభినందనలు. కలిసి జీవితాంతం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. నిశ్చితార్థం: 9 జూన్, 2003.” అని ఒక నిశ్చితార్థ కార్డ్ ను షేర్ చేశారు. దీంతో మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లికి ముహూర్తం రెడీ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

    త్వరలోనే పెళ్లి తేదీని వెల్లడించనున్నారు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఇద్దరూ ప్రస్తుతం తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.