Vijay : రజినీలా వయసు మళ్ళాక కాదు, రక్తం సలసలా కాగుతున్నప్పుడే! విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయం!

ఇవన్నీ పరిగణలోకి తీసుకుని రజినీకాంత్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడు. ఈ తప్పు విజయ్ చేయకూడదు అనుకుంటున్నారట. ఆయన ఐదు పదుల వయసులోనే రాజకీయాల్లోకి రానున్నారట.

Written By: Shiva, Updated On : June 8, 2023 11:38 am
Follow us on

Vijay : దశాబ్దాల పాటు కోలీవుడ్ ని ఏలిన స్టార్ హీరో రజినీకాంత్. ఆయనకు తమిళనాడులో అశేష అభిమానగణం ఉంది. ఎప్పటికైనా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు, సీఎం సీటు అధిరోహిస్తారని అభిమానులు భావించారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఉంది. ఎట్టకేలకు ఆయన రాజకీయ ప్రవేశం ప్రకటించారు. కానీ రజినీకాంత్ కి వయసు సహకరించలేదు. ఎనభై ఏళ్లకు దగ్గరపడుతున్న రజినీకాంత్ తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. దాంతో రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేశారు. ఇది అభిమానులను తీవ్రంగా కలచివేసింది. 

 
వారు ఎన్ని ధర్నాలు చేసినా రజినీకాంత్ నిర్ణయం మార్చుకోలేదు. రాజకీయాల్లోకి వచ్చేది లేదని తేల్చిపారేశారు. కనీసం అరవై ఏళ్ల వయసులో రజినీకాంత్ ఎంట్రీ ఇచ్చినా బాగుండేది. వయసు మళ్ళాక ఏం చేయలేక తప్పుకున్నారు. రాజకీయాలు అంత సులభం కాదు. లీడర్ కి క్షణం తీరిక ఉండదు. సాధారణ జనాలను కలవడం, వారితో మాట్లాడటం చేయాలి. ఊళ్లకు ఊళ్లు సుడిగాలి పర్యటనలు చేయాలి. దానికి శక్తి ఉండాలి. ఆరోగ్యం సహకరించాలి. అధికారం దక్కినా గంటల తరబడి అధికారులతో పని చేయాల్సి ఉంటుంది. 
 
ఇవన్నీ పరిగణలోకి తీసుకుని రజినీకాంత్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడు. ఈ తప్పు విజయ్ చేయకూడదు అనుకుంటున్నారట. ఆయన ఐదు పదుల వయసులోనే రాజకీయాల్లోకి రానున్నారట. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారట. విజయ్ రాజకీయాల్లోకి రావడానికి సర్వం సిద్ధమన్న మాట ప్రముఖంగా వినిపిస్తోంది. 
 
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ మద్దతుదారులు విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించే కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. 48 ఏళ్ల విజయ్ యంగ్ పొలిటీషియన్ గా తమిళనాడు పాలిటిక్స్ ని శాసించనున్నాడని కోలీవుడ్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. తమిళనాడులో ఇప్పుడు హవా విజయ్ దే. రజినీకాంత్ నంబర్ వన్ పొజిషన్ విజయ్ సొంతం చేసుకున్నాడు. అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన హీరోగా ఎదిగాడు. కాబట్టి రజినీకాంత్ చేయలేనిది విజయ్ చేసి చూపించాలని అనుకుంటున్నారట….