https://oktelugu.com/

అమెజాన్ కస్టమర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఖాతా ఖాళీ..?

ఈ మధ్య కాలంలో మోసగాళ్లు ఒక మోసం వెలుగులోకి వస్తే మరో విధంగా మోసం చేస్తూ అమాయకుల ఖాతాలలోని డబ్బును మాయం చేస్తున్నారు. తాజాగా అమెజాన్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ మోసగాళ్లు చేస్తున్న ఒక మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లోన్ యాప్స్ చేస్తు న్న మోసం వెలుగులోకి రాగా ఆ మోసాన్ని మరవక ముందే కొత్తరకం మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. బర్స్ మనీ యాప్ ఫ్రాడ్ ఈ మధ్య […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 29, 2020 6:20 pm
    Follow us on


    ఈ మధ్య కాలంలో మోసగాళ్లు ఒక మోసం వెలుగులోకి వస్తే మరో విధంగా మోసం చేస్తూ అమాయకుల ఖాతాలలోని డబ్బును మాయం చేస్తున్నారు. తాజాగా అమెజాన్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ మోసగాళ్లు చేస్తున్న ఒక మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లోన్ యాప్స్ చేస్తు న్న మోసం వెలుగులోకి రాగా ఆ మోసాన్ని మరవక ముందే కొత్తరకం మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. బర్స్ మనీ యాప్ ఫ్రాడ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతోంది.

    ఎవరైతే ఇందులో పెట్టుబడులు పెడతారో వాళ్ల ఖాతాలలోని డబ్బులు మాయమవుతున్నాయి. అమెజాన్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ కొందరు మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అమెజాన్ ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు పొందవచ్చంటూ కొందరు మోసగాళ్లు సోషల్ మీడియాలో లింక్ లను షేర్ చేస్తున్నారు. అయితే అలా డబ్బులను పొందాలంటే కొంత మొత్తం నగదు చెల్లించాలని చెబుతున్నారు.

    అమెజాన్ లో నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయి కాబట్టి వాటిని తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని నమ్మి చాలామంది పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. చాలామంది బర్స్ మనీ యాప్ అమెజాన్ కు సంబంధించిన యాప్ అని భావిస్తున్నారు. అయితే ఈ యాప్ అమెజాన్ కు సంబంధించిన యాప్ కాదు. తెలుగు రాష్ట్రాల్లో బర్స్ యాప్ వల్ల మోసపోతున్న వారి జాబితా అంతకంతకూ పెరుగుతోంది.

    మొదట్లో ఈ యాప్ లో రీచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పని చేశాయని.. అయితే ఈ మధ్య కాలంలో పని చేయడం లేదని బాధితులు చెబుతున్నారు. ఈ యాప్ నిర్వాహకుల అడ్రస్ లేకపోవడంతో తమ డబ్బులు వెనక్కు వస్తాయో రావో అని చాలామంది భయాందోళనకు గురవుతున్నారు.