తొలి షెడ్యూల్ పూర్తి చేసిన వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గద్దలకొండ గణేష్’గా నటించి బాక్సాఫీస్ విజయాన్ని దక్కించుకున్నాడు. అదేవిధంగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్-2’లో విక్టరీ వెంకటేష్ తో మల్టిస్టారర్ మూవీలో వరుణ్ తేజ్ నటించారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. తాజాగా కొర్రపాటి కిరణ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఈ మూవీలో […]

Written By: Neelambaram, Updated On : March 12, 2020 3:04 pm
Follow us on

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గద్దలకొండ గణేష్’గా నటించి బాక్సాఫీస్ విజయాన్ని దక్కించుకున్నాడు. అదేవిధంగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్-2’లో విక్టరీ వెంకటేష్ తో మల్టిస్టారర్ మూవీలో వరుణ్ తేజ్ నటించారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. తాజాగా కొర్రపాటి కిరణ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నాడు.

ఈ మూవీలో బాక్సర్ కనిపించేందుకు వరుణ్ తేజ్ యు.ఎస్‌లో ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ పొందారు. అలాగే ముంబాయిలో ప్రత్యేక ట్రైనర్ సహాయంతో ప్రొఫెషినల్ బాక్సర్ గా కనిపించేందుకు ఫోకస్ పెట్టిన సంగతి తెల్సిందే. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ వరుణ్ తేజ్ కు జోడీగా నటిస్తుంది. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ఈ మూవీని స‌మ‌ర్పిస్తున్నాడు. రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

దర్శకుడు కొర్రపాటి కిరణ్ ఈ మూవీని ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశాడు. గతంలోనూ పవర్ స్టార్(బాబాయ్) ‘తమ్ముడు’ మూవీలో బాక్సర్ గా కనిపించి బాక్సాఫీస్ రికార్డు సృష్టించాడు. ఇక వరుణ్ తేజ్(అబ్బాయ్) ఆ తరహాలోనే బాక్సర్ పాత్ర పోషిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. జూలై 30న సినిమాను విడుద‌ల చేయ‌డానికి చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.