Varudu Kaavalenu: నాగ శౌర్య హిట్ కోసం కోటి ఆశలతో రీతూ వర్మతో కలిసి చేసిన సినిమా ‘వరుడు కావలెను’. సినిమా అవుట్ ఫుట్ పై ఇప్పటికే కొన్ని చోట్ల నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా బాగా స్లో నేరేషన్ ఉందని.. ఎక్కడా ఇంట్రెస్ట్ కలిగించే ప్లే లేదని.. ఇలా ఏవరేజ్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వర్షం కురిపించ లేకపోయింది ఈ సినిమా. మరి కలెక్షన్స్ చాలా ఏరియాల్లో ఇంకా స్టడీగా ఉన్నాయా ? లేక డిజాస్టర్ కి పడిపోయాయా ? చూద్దాం.

ఏరియాల వారీగా ఫస్ట్ మూడు రోజుల కలెక్షన్స్ !
నైజాం 0.83 కోట్లు,
సీడెడ్ 0.30 కోట్లు,
ఉత్తరాంధ్ర 0.28 కోట్లు,
గుంటూరు 0.25 కోట్లు,
ఈస్ట్ 0.20 కోట్లు,
వెస్ట్. ఓ.16 కోట్లు,
కృష్ణా 0.21 కోట్లు,
నెల్లూరు 0.15 కోట్లు,
తెలంగాణ & ఏపీలో ఫస్ట్ మూడు రోజుల కలెక్షన్ల షేర్ : రూ. 2.38 కోట్లు,
ఇక ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ మరియు ‘ఓవర్సీస్’ కలెక్షన్స్ విషయానికి వస్తే..
రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ : 0.13 కోట్లు,
ఓవర్సీస్ కలెక్షన్స్ : 0.75 కోట్లు,
వరల్డ్ వైడ్ గా చూసుకున్నా వరుడు కావెలను ఏవరేజ్ కలెక్షన్స్ నే కలెక్ట్ చేసింది. దీనికితోడు, నాగశౌర్య మార్కెట్ కి మించి వరుడు కావెలను సినిమాకు ఎక్కువ బడ్జెట్ పెట్టారు. అలాగే ఎక్కువ రేట్లకు అమ్మారు. కాబట్టి ఈ సినిమా విజయం సాధించాలంటే.. కనీసం మరో 4 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
Also Read: Anupama Parameswaran: రౌడీ బాయ్స్ మూవీ కోసం హద్దుమీరుతున్న అనుపమ…
ఏ సినిమా పోటీ లేని సమయంలోనే ఈ సినిమా తక్కువ షేర్ ను రాబట్టింది. ఇక పోటీలో ఇంకా కలెక్షన్స్ ఏమి వస్తాయి ? పైగా ఈ వారం అంచనాలు ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ పోటీలో వరుడు కావలెను నిలబడి వసూళ్లు చేయడం అంటే దాదాపు అసాధ్యమే.
Also Read: Nayattu Movie: తెలుగులో రీమేక్ కానున్న “నాయట్టు” చిత్రం…