‘Varsham’ re-release worldwide collections : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star Prabhas) కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ చిత్రంగా పిలవబడే ‘వర్షం'(#Varsham4k Re Release) చిత్రం అభిమానులకు ఎంతో స్పెషల్. ఈ సినిమాలోని పాటలు ఆరోజుల్లో ఒక సెన్సేషన్. ఇప్పటికీ ఆ పాటలు వినపడుతూనే ఉంటాయి. ఈ చిత్రం ద్వారానే త్రిష మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. ఇందులో గోపీచంద్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే నిన్న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. ఇప్పటికే గడిచిన రెండు మూడు సంవత్సరాలలో ఈ చిత్రాన్ని రెండు సార్లు రీ రిలీజ్ చేశారు. అప్పుడు రానటువంటి రెస్పాన్స్, నిన్న వచ్చింది. ప్రభాస్ అభిమానులకు ప్రతీ ఏడాది కనీసం రెండు సినిమాలు విడుదల అవుతుందే లోపు రీ రిలీజ్ చిత్రాలను అప్పట్లో పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఈ ఏడాది ఆయన నుండి ఒక్క సినిమా కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపించకపోవడం తో రీ రిలీజ్ చిత్రాలను ప్రోత్సహించడం మొదలు పెట్టారు.
అందుకే ‘వర్షం’ చిత్రానికి ఈసారి అంతటి రేంజ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రీసెంట్ గా విడుదలైన ‘యమదొంగ’ చిత్రం కనీసం 50 లక్షల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది అనే విషయం మన అందరికీ తెలిసిందే. రీ రిలీజ్ ట్రెండ్ అంతం అయిపోయిందేమో అని అంతా అనుకున్నారు కానీ, అలాంటిదేమి జరగలేదని ఈ చిత్రం నిరూపించింది. ఎక్కడ చూసిన నిన్న హౌస్ ఫుల్ బోర్డ్స్ కనపడ్డాయి. సోషల్ మీడియా లో అయితే వర్షం చిత్రం థియేటర్స్ లోని హంగామా కి సంబంధించిన వీడియోలే కనపడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రభాస్ అభిమానులకు నిన్న ఒక పెద్ద పండుగ లాగా ఉన్నింది అని చెప్పొచ్చు.
Also Read : ‘వర్షం’ రీ రిలీజ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్..అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ‘యమదొంగ’ అవుట్!
బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి నిన్న ఒక్క రోజే 18 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా 36 వేల టికెట్స్ సేల్ అయ్యాయి. మొత్తం మీద 54 వేల టికెట్స్ ఈ చిత్రానికి అమ్ముడుపోయాయి. ఇది బ్లాక్ బస్టర్ రేంజ్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మొదటి రోజు ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా రెండు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నేడు రేపు కూడా థియేట్రికల్ రన్ కొనసాగే అవకాశం ఉండడం తో కచ్చితంగా ఈ చిత్రానికి ఫుల్ రన్ లో నాలుగు కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు, ఇది చాలా పెద్ద మైనస్ అనే అనుకోవాలి.