Varsham Re Release: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘వర్షం'(Varsham Movie). శోభన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్(Gopichand) విలన్ గా నటించగా, త్రిష(Trisha Krishnan) హీరోయిన్ గా నటించింది. ఆరోజుల్లో ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి అంజి, నందమూరి బాలకృష్ణ ‘లక్ష్మి నరసింహా’ చిత్రాలకు పోటీగా సంక్రాంతి బరిలోకి దిగింది. ఆ రెండు సినిమాలను తట్టుకొని, ఈ చిత్రం వాటికంటే అత్యధిక వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ట్రేడ్ విశ్లేషకులు అంచనా ప్రకారం ఆరోజుల్లోనే ఈ చిత్రం 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అలాంటి సినిమాని నేడు గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. వాస్తవానికి ఇది వరకే ఈ చిత్రాన్ని రెండు సార్లు రీ రిలీజ్ చేశారు. కానీ అప్పట్లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ నేడు మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
బుక్ మై షో యాప్ ద్వారా ఈ చిత్రానికి మొదటి రోజు 37 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం బుక్ మై షో లో గంటకు ఒక వెయ్యికి పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. రీసెంట్ గా విడుదలైన యమదొంగ చిత్రానికి మొదటి రోజు కేవలం 26 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. సాయంత్రం షోస్ ఇంకా భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో ఈ చిత్రం దుమ్ము దులిపేస్తుంది. యమదొంగ చిత్రానికి మూడు రోజులకు కలిపి రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తే, వర్షం చిత్రానికి కేవలం మొదటి రోజే కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఫుల్ రన్ లో కచ్చితంగా నాలుగు కోట్ల రూపాయిల రేంజ్ లో వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందా రాలేదా అనేది చూడాలి.
ఈ ఏడాది ప్రభాస్ నుండి విడుదలైన రెండు రీ రిలీజ్ సినిమాలు సక్సెస్ అయ్యినట్టే. కొద్దిరోజుల క్రితమే ‘సలార్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ‘వర్షం’ తో మరో భారీ సక్సెస్ ని అందుకున్నారు. ఇలా ఒకే సంవత్సరం లో రెండు సినిమాల రీ రిలీజ్ లు సక్సెస్ అవ్వడం కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయారు. ఇక ప్రభాస్ పుట్టిన రోజు కి మరో రీ రిలీజ్ ని ప్లాన్ చేసి ఇలాగే గ్రాండ్ సక్సెస్ చేస్తే ఒకే ఏడాది లో మూడు రీ రిలీజ్ చిత్రాలను సక్సెస్ చేసిన హీరో ఫ్యాన్స్ గా ప్రభాస్ ఫ్యాన్స్ నిలిచిపోతారు.