spot_img
Homeఎంటర్టైన్మెంట్Hari Hara Veeramallu advance bookings : ఓవర్సీస్ లో 'హరి హర వీరమల్లు' తాండవం..అడ్వాన్స్...

Hari Hara Veeramallu advance bookings : ఓవర్సీస్ లో ‘హరి హర వీరమల్లు’ తాండవం..అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఏ రేంజ్ లో ఉందంటే!

Hari Hara Veeramallu advance bookings : చాలా కాలం గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఎన్నో ఒడిదుడుగల మధ్య షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నిన్ననే ప్రారంభించారు. బుకింగ్స్ మొదలు పెట్టి అమెరికా లో ఇంకా 24 గంటలు కూడా గడవలేదు. అప్పుడే ఈ చిత్రం రికార్డ్స్ వేట మొదలు పెట్టింది. కేవలం 12 గంటల్లోనే ఈ చిత్రానికి 30 వేల అమెరికన్ డాలర్లు వచ్చినట్టు ఆ చిత్రం డిస్ట్రిబ్యూటర్ నిన్న అధికారిక ప్రకటన చేసాడు. ఆయన ఆ ప్రకటన చేసిన తర్వాత అనేక షోస్ షెడ్యూల్ అయ్యాయి. గ్రాస్ వసూళ్లు ఇంకా పెరిగాయి. బుకింగ్స్ మొదలు పెట్టి మొదటి రోజు పూర్తి అయ్యే సమయానికి ఈ చిత్రం 60 వేల డాలర్ల మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇది ఆల్ టైం టాప్ 3 రికార్డు గా భావించవచ్చు. రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సినిమాల్లో బుకింగ్స్ మొదలు పెట్టిన మొదటి రోజు అత్యధిక గ్రాస్ ని నమోదు చేసుకున్న చిత్రాల లిస్ట్ తీస్తే ‘కల్కి 2898 AD’ చిత్రం మొదటి స్థానం లో ఉంటుంది. ఈ చిత్రానికి బుకింగ్స్ మొదలు పెట్టిన మొదటి రోజు దాదాపుగా లక్షా 30 వేల డాలర్లు వచ్చాయి. ఇక ఆ తర్వాతి స్థానం లో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం నిల్చింది. ఈ సినిమాకు బుకింగ్స్ మొదలు పెట్టిన మొదటి రోజు 75 వేల డాలర్లు రాగా, ‘హరి హర వీరమల్లు’ చిత్రం 60 వేల  డాలర్లతో మూడవ స్థానం లో నిల్చింది. వాస్తవానికి ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఆల్ టైం రికార్డు గ్రాస్ నమోదు అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరగాలంటే కచ్చితంగా థియేట్రికల్ ట్రైలర్ ఉండాలి.

Also Read : మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?

కనీసం ఒక్క చార్ట్ బస్టర్ సాంగ్ అయినా ఉండాలి. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి అవే కొరవడ్డాయి. మొన్న విడుదలైన మూడవ పాట మినహా, అంతకు ముందు విడుదల చేసిన రెండు పాటలకు యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ పేరు మీద మాత్రమే ఈ రేంజ్ టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక ‘హరి హర వీరమల్లు’ తర్వాతి స్థానం లో 52 వేల రూపాయిల గ్రాస్ మార్కు తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం నిల్చింది. ఇక ఆ తర్వాత 24 వేల డాలర్ల గ్రాస్ తో ‘గుంటూరు కారం’ చిత్రం 5 వ స్థానం లోనూ, 22 వేల గ్రాస్ డాలర్స్ తో ‘గేమ్ చేంజర్’ చిత్రం ఆరవ స్థానంలోనూ నిలిచాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper
Exit mobile version