Samantha Yashoda: విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మరియు అభిమానులను ఆకట్టుకునే సమంత..మరోసారి విబిబిన్నమైన కథాంశం తో మన ముందుకు ‘యశోద’ అనే సినిమా ద్వారా రాబోతుంది..ఆసక్తికరమైన టీజర్ మరియు ట్రైలర్ తో అంచనాలను రేపిన ఈ చిత్రం ఈ నెల 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది..సమంత కి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు అనే విషయం మన అందరికి తెలిసిందే..తనకి సోకినా మయోసిటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది..ఒక పక్క చికిత్స తీసుకుంటూనే మరోపక్క తన సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసిన ఈమె..ఇప్పుడు ప్రొమోషన్స్ కూడా చెయ్యడానికి సిద్ధమైంది.

చికిత్స సమయం లో కూడా సినిమా కోసం ఇంత డెడికేషన్ చూపిస్తుందంటే నిజంగా గ్రేట్ అనే అనాలి..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని మేజర్ ప్రాంతాలలో ప్రారంభం అయ్యింది..అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కూడా ఆశాజనకంగానే ఉన్నాయి..పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి దాదాపుగా 40 కోట్ల రూపాయిల బడ్జెట్ అయ్యిందట.
సమంత మార్కెట్ కి మించి ఖర్చుపెట్టినప్పటికీ కూడా నిర్మాతలకు ఏ మాత్రం టెన్షన్ లేదట..ఎందుకంటే సినిమా అంత అద్భుతంగా వచ్చింది అంటూ ప్రొమోషన్స్ లో చెప్పుకుంటున్నారు..ఇది ఇలా ఉండగా యశోద మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభాస్ సినిమా ని సైతం దాటేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..ఇటీవల కాలం లో స్పెషల్ షోస్ ట్రెండ్ ఎలా క్రేజీ గా మారిందో మన అందరికి తెలిసిందే..ప్రభాస్ పుట్టినరోజునాడు బిల్లా మూవీ స్పెషల్ షోస్ ని వేసుకున్నారు..మంచి రెస్పాన్స్ వచ్చింది..ఇప్పుడు ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పిన మరో చిత్రం వర్షం ని కూడా ఈ నెల 11 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు నిర్మాతలు..ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.

బుకింగ్స్ స్టేటస్ సమంత యశోద చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కంటే చాలా తక్కువ ఉండడం విశేషం..ఎప్పుడో 18 క్రితం విడుదలైన సినిమాతో కొత్త సినిమాని పోల్చడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు..కానీ ఈమధ్య విడుదలైన రీ రిలీజ్ సినిమాలన్నిటికీ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి..ఒక్క వర్షం సినిమాకి తప్ప..సరైన పబ్లిసిటీ లేకపోవడమే అందుకు కారణం అంటున్నారు ఫాన్స్.