Allu Arjun Assets: పిల్లలు అంటే ఎవరికైనా ప్రేమే. వాళ్ళ భవిష్యత్ కోసం పుట్టినప్పటి నుండే ఆలోచిస్తారు. వాళ్ళను డాక్టర్స్ చేయాలి, ఇంజనీర్స్ చేయాలంటూ కలలు కంటారు. దానికి అవసరమైన డబ్బులు కష్టపడి సంపాదించి పోగేస్తారు. వారసుల ఫ్యూచర్ కోసం ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అయితే కూతుళ్ళకు కట్న కానుకలు ఇచ్చి పంపేయాలి అనుకుంటారు. సంపాదించిన మొత్తం కొడుక్కి ఇవ్వాలి అనుకుంటారు. అయితే అల్లు అర్జున్ దీనికి భిన్నంగా ఆలోచించినట్లు తెలుస్తుంది. ఆయన సంపాదించిన కోట్ల ఆస్తి కూతురుకు చెందేలా వీలునామా రాశారన్న ఒక షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

అల్లు అర్జున్ కి పిల్లలంటే ప్రాణం. ఖాళీ సమయం దొరికితే ఇంట్లో అర్హ, అయాన్ లతో ఆడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కూతురు అర్హతో సరదాగా గడపటం అల్లు అర్జున్ కి ఇష్టమైన వ్యాపకం. అర్హతో ఫన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో విడుదల చేస్తాడు. అంతగా ప్రేమించే కూతురు భవిష్యత్తు కోసం ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటి వరకు సంపాదించిన కోట్ల రూపాయలు, ఆస్తులు అర్హకు చెందేలా వీలునామా రాయించాడట. స్వయంగా తాను సంపాదించిన మొత్తం అర్హకు దక్కాలని అల్లు అర్జున్ కోరుకుంటున్నారట.
మరో కొడుకు అయాన్ సంగతి ఏంటయ్యా… అంటే తండ్రి అల్లు అరవింద్, తాత అల్లు రామలింగయ్య సంపాదించిన ఆస్తి కోట్లలో ఉంది. అల్లు అరవింద్ ముగ్గురు కుమారులకు అది సమానంగా చెందుతుంది. అల్లు అర్జున్ వాటా ఆస్తి అయాన్ కి సంక్రమిస్తుందట. అదే సమయంలో అల్లు అయాన్ మగపిల్లాడిగా తన కాళ్లపై తాను నిలబడాలని అల్లు అర్జున్ ఆలోచన అట. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వైరల్ అవుతుంది.

కాగా అయాన్ కంటే ముందు అర్హ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్నారు. సమంత-గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం మూవీలో అర్హ చైల్డ్ రోల్ చేస్తున్నారు. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న శాకుంతలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. వాచ్ ఏడాది శాకుంతలం విడుదల కానుంది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 షూట్ కి సిద్ధం అవుతున్నారు. త్వరలో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ మొదలుకానుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.