
తెలుగు పరిశ్రమలో చాలా విచిత్రమైన దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు ఆయనే పోటీ. ఎప్పుడు హీరోయిన్ల గురించి మాట్లాడే ఆయన తన మనసులోని భావాలను ఉన్నది ఉన్నట్లు పంచుకునే అలవాటు ఉంది. ఎదుటి వారు ఏమనుకున్న ఫర్వాలేదని భావించి మనసులో ఉన్న భావాలను ఉన్నపళంగా బయట పెట్టడం ఆయన నైజం. కెరీర్ ఆరంభంలో గొప్ప సినిమాలు నిర్మించి తానేమిటో నిరూపించుకున్న వర్మ అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగారు.
రాంగోపాల్ వర్మ ఎప్పుడు వివాదాల్లో ఇరుక్కోవడం తెలిసిందే. ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎప్పుడు వార్తల్లో ఉంటారు. దీంతో ఆయన అభిమానులు, సెలబ్రిటీలు సైతం ఆయనకు వ్యతిరేకంగా మారిపోయిన సంఘటనలున్నాయి. క్రైమ్, లవ్, రొమాంటిక్, హర్రర్, థ్రిల్లర్ చిత్రాలతో తనదైన శైలి చూపించిన దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ప్రముఖులు. ఈ మధ్య కాంలో ఆయన తన శైలి మార్చుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాల నిర్మాణానికే మొగ్గు చూపుతున్నారు.
ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పుడు సంచలనాలు సృష్టిస్తుంటాయి.ఒక దశలో కోర్టుల వరకు వెళ్లిన సినిమాలు కూడా ఉన్నాయి. దీంతో ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరిట సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకుని తద్వారా తన సినిమాలను విడుదల చేసుకుంటున్నారు. క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్, డేంజరస్, కరోనా వైరస్ వంటి వినూత్నమైన చిత్రాలు నిర్మించి తనలో ఓ టేస్ట్ ఉ:దని నిరూపించుకున్నారు.
హీరోయిన్ల అందాలకు ఫిదా అయిపోయే వర్మకు శ్రీదేవి అంటే ప్రాణం. ఆమె అందాలను పొగడటంలో ఆయనదే పైచేయి. గతంలో బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీతో కూడా ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలిచారు. అప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆయన మాటలు వైరల్ అయ్యాయి. తాజాగా సునీల్, వైశాలీరాజ్, సుక్రాంత్, హిమజ ప్రధాన పాత్రల్లో నటించిన కనబడుట లేదు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్ లో జరిగింది. దీనికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తోపాటు రాంగోపాల్ వర్మ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అయితే ఇక్కడ వర్మ మాట్లాడిన మాటలకు అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినిమా చూశానని ప్రతి సన్నివేశం బాగుందని కితాబిచ్చారు. హీరోను పిలిచి సినిమాలో కొన్ని సీన్లు చూశాను. కానీ ఏమనుకోకు నిన్ను మాత్రం చూడలేదు. ఎందుకంటే పక్కన ఉన్న వైశాలినే నన్ను ఎంతగానో ఆకర్షించింది. వైశాలీ నువ్వు ఇరగదీశావు. ఎంతో గ్లామర్ గా ఉన్నావ్ అంటూ వర్మ మెచ్చుకున్నారు. హీరోను పిలిచి హీరోయిన్ ను పొగడటంతో అందరు పగలబడి నవ్వుకున్నారు. ఇదే వర్మ విచిత్రమైన మనస్తత్వం అని అందరు అనుకున్నారు.