Varanasi set of SSMB29: మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమా ఈమధ్యనే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ లో ఉన్న మహేష్ బాబు మరికొద్ది రోజుల్లోనే రాజమౌళి ప్రారంభించే మూడవ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఈ మూడవ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో మూవీ టీం చాలా రోజుల నుండి వారణాసి సెట్స్ ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ సెట్స్ రెడీ అయ్యినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సెట్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. రాజమౌళి మార్క్ గ్రాండియర్ ఆ సెట్స్ లో కనిపించిందని, సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారని ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సెట్స్ ని నిర్మించడానికి దాదాపుగా 40 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం.
also Read: SSMB29: రాజమౌళి నుండి పాస్ పోర్ట్ దొంగతనం చేసిన మహేష్ బాబు..వీడియో వైరల్!
ఇంత కష్టపడి సెట్స్ ని నిర్మించడం ఎందుకు?, నేరుగా వారణాసి కి వెళ్లి షూటింగ్ చేసుకోవచ్చు కదా?, అనవసరమైన ఖర్చులు ఎందుకు అని కొంతమంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఒక రోజు, రెండు రోజులకు అయితే అనుమతి ని ఇస్తారు కానీ, ఒకప్పటి లాగా నెలల తరబడి షూటింగ్స్ కి వారణాసిలో అనుమతులు ఇచ్చే పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. అందుకే రాజమౌళి వారణాసి నే హైదరాబాద్ కి తీసుకొచ్చేసాడు. సెట్ వర్క్స్ కి సంబంధించిన ప్యాచ్ వర్క్ ఇంకా బ్యాలన్స్ ఉందట. మరో రెండు రోజుల్లో ఆ పనులు కూడా పూర్తి అవుతాయని సమాచారం. ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండవ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పై ఒక పాటని కూడా చిత్రీకరించారు.
బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడి సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ మిలియన్ డాలర్ల రూపం లో పారితోషికం అందుకుంటున్న ప్రియాంక చోప్రా, చాలా కాలం తర్వాత చేస్తున్న ఇండియన్ చిత్రమిది. అంతే కాదు ఈ చిత్రం లో మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొదట నెగటివ్ క్యారక్టర్ అంటూ ప్రచారం జరిగింది కానీ,ఇప్పుడు నెగటివ్ క్యారక్టర్ కోసం తమిళ హీరో మాధవన్ ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే రామాయణం లో హనుమంతుడు లక్షణుడి కోసం పారిజాత పుష్పం తీసుకొని రావడానికి ఎలా అయితే ప్రయాణం చేసాడో, అదే పర్వతంలో ఆ పారిజాత పుష్పాలను ఒకరి ప్రాణం కాపాడడం కోసం మహేష్ బాబు చేసే సాహసోపేత ప్రయాణమే ఈ చిత్రమని అంటున్నారు. అనుకున్న విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే హాలీవుడ్ మూవీ రికార్డ్స్ ని కూడా బద్దలు కొడుతుందని విశ్లేషకులు అంటున్నారు.