Andala Rakshasi Re-release Openings: సమ్మర్ లో పెద్ద హీరోల సినిమాలు లేక థియేటర్స్ వెలవెలబోతున్నాయి. అనేక ప్రాంతాల్లో థియేటర్స్ నడపలేక మూసేస్తున్నారు. జూన్ 12 న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం విడుదలై థియేటర్స్ కి పూర్వ వైభవం తీసుకొస్తుందని అంతా అనుకున్నారు కానీ, ఆ చిత్రం చివరి నిమిషం లో వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది కదా అని ఆ డేట్ కి వేరే సినిమాలు రావాల్సి ఉన్నా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పది రోజులు ఏ సినిమా విడుదల లేకపోవడం తో పాత సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటున్నారు. ఈరోజు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మొదటి సినిమా ‘అందాల రాక్షసి'(Andala Rakshasi) చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. నవీన్ చంద్ర, రాహుల్ రవిచంద్రన్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఈ నలుగురికి ఈ చిత్రం మొదటి సినిమానే.
అప్పట్లో ఈ చిత్రానికి మంచి సినిమా అనే రివ్యూస్ బాగానే వచ్చాయి కానీ, కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ అవ్వలేదు కానీ జనరేషన్ మారిన తర్వాత నేటి తరం ఆడియన్స్ కి ఈ చిత్రం బాగా నచ్చింది. టీవీ లలో, మరియు ఇతర ఓటీటీలలో ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు. ఫలితంగా క్లాసిక్ స్టేటస్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్రాన్ని నేడు గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రీతిలో వచ్చింది. బుక్ మై షో యాప్ లో గడిచిన 24 గంటల్లో ఈ సినిమాకు 17 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. రీసెంట్ గా విడుదలైన స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్ లకు కూడా ఈ రేంజ్ లో టికెట్స్ అమ్మకాలు జరగలేదు. మరోపక్క రేపు పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లాసిక్ గా పేరొందిన ‘తొలిప్రేమ’ చిత్రం కూడా రీ రిలీజ్ అవ్వబోతుంది.
Also Read: Naveen Chandra : నేను నటుడిని అయ్యినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది – నవీన్ చంద్ర
ఈ సినిమాకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ‘అందాల రాక్షసి’ చిత్రానికి మొదటి రోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్ ముగిసే సమయానికి కచ్చితంగా రెండు కోట్ల గ్రాస్ మార్కుని దాటుతుందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.రీ రిలీజ్ సినిమాలకు వస్తున్న వసూళ్లను చూస్తుంటే ఆడియన్స్ సినిమాల కోసం ఎంత కరువులో ఉన్నారో అర్థం అవుతుంది అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. దర్శక నిర్మాతలు బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేసుకున్నారని, పెద్ద హీరోల సినిమాలు విడుదల అయ్యుంటే వేరే లెవెల్ లో ఆడియన్స్ థియేటర్స్ కి కదిలి ఉండేవారని అంటున్నారు.