Varanasi Update: తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. 100% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకెళ్తున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో చేస్తున్న ‘వారణాసి’ సినిమాను పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా లు సైతం ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక వీళ్లతో పాటుగా మరొక నటుడు కూడా ఇందులో భాగం అయినట్టుగా తెలుస్తోంది. విలక్షణ నటుడిగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన ప్రకాష్ రాజ్ సైతం ఇందులో భాగం అయినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ సైతం తెలియజేయడం విశేషం…అత్యంత ప్రస్టేజీయస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో నేను భాగమవ్వడం చాలా ఆనందం గా ఉంది…నా మొదటి షెడ్యూల్ చాలా సంతోషంగా గడిచింది. రాజమౌళి నన్ను ట్రీట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అలాగే ఇతర నటి నటులు అయిన మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ల సహకారం కూడా నచ్చింది.
మరో షెడ్యూల్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను…ఈ సినిమాలో నటించడం నా అదృష్టం అంటూ ఆయన కామెంట్స్ చేశాడు. ప్రకాశ్ రాజ్ రాజమౌళి సినిమాల్లో పెద్దగా నటించలేదు. కేవలం విక్రమార్కుడు సినిమాలో మాత్రమే నటించాడు. అది కూడా ఒక తక్కువ నిడివి ఉన్న క్యారెక్టర్ కావడం విశేషం…మహేష్ బాబు ప్రకాష్ రాజ్ కలిసి చాలా సినిమాల్లో నటించారు.
మహేష్ మొదటి సినిమా ఆయన ‘రాజకుమారుడు’ నుంచి మొదలైన వీళ్ళ ప్రస్థానం ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండటం విశేషం…ఇక వారణాసి సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది తెలియాల్సి ఉంది. తను ఈ సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడా? లేదంటే నెగెటివ్ క్యారెక్టర్ లో కన్పించబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది…