Peddi Movie: గత వారం రోజుల నుండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ఎక్కువ ఢిల్లీ రోడ్ల పై కనిపిస్తున్నాడు. నిన్న గాక మొన్న ఆయన ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో కనిపించిన ఫోటోలను మనం చూసాము. ఇప్పుడు ఆయన ఢిల్లీ లోకి ఏపీ భవన్ లోకి అడుగుపెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రామ్ చరణ్ ఎందుకు సడన్ గా ఢిల్లీ లో కనిపిస్తున్నాడు?, ఏమైనా విశేషం ఉందా?, రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడా వంటి సందేహాలు కొంతమంది అభిమానుల్లో ఉన్నాయి. అయితే ఇది రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదు. కేవలం రామ్ చరణ్ ‘పెద్ది'(Peddi Movie) సినిమాకు సంబంధించిన షూటింగ్ మాత్రమే అని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. రీసెంట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఒక భారీ కుస్తీ ఫైట్ సన్నివేశాన్ని తెరకెక్కించిన టీం, ఇప్పుడు ఢిల్లీ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గ్లింప్స్ వీడియో కి అద్భుతమైన రెస్పాన్స్ రాగా, రీసెంట్ గా విడుదల చేసిన ‘చికిరి..చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించింది. యూట్యూబ్ లో కేవలం తెలుగు వెర్షన్ నుండి 110 మిలియన్ కి పైగా ఈ పాట వ్యూస్ ని సంపాదించుకుంది. ఓవరాల్ అన్ని భాషలకు కలిపి 200 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ పాటకు ఇంతటి రెస్పాన్స్ రావడం తో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరికొన్ని స్టెప్పులను జత చేయాలనీ చూస్తున్నారట. ఢిల్లీ షెడ్యూల్ పూర్తి అవ్వగానే, ఈ పాటకు సంబంధించిన ప్యాచ్ వర్క్ చేస్తారని టాక్ . ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ 27 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కానీ ఆ డేట్ కి కచ్చితంగా ఈ సినిమా వస్తుందా లేదా అనేది జనవరి నెలాఖరున తెలుస్తుంది.
ఏపీ భవన్ క్యాంటీన్లో ‘పెద్ది’ సందడి!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఢిల్లీలో తన కొత్త చిత్రం ‘పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. దర్శకుడు బుచ్చిబాబు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో కలిసి ఆయన అక్కడ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ భవన్లలో చిత్ర యూనిట్ కొన్ని కీలక… pic.twitter.com/KeoPdZrSnX
— ChotaNews App (@ChotaNewsApp) December 23, 2025