కరోనా పుణ్యమా అంటూ డిజిటల్ స్ట్రీమింగ్స్ రోజురోజుకూ జనంలోకి చొచ్చుకొని పోతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి సంవత్సరాలలో రాని ఫాలోవర్స్ ఈ లాక్ డౌన్ కాలంలో రెట్టింపు సంఖ్యలో వచ్చారంటేనే అర్ధం చేసుకోవచ్చు, జనానికి వెబ్ థియేటర్లు ఎంతగా కనెక్ట్ అయిపోయాయో.. చక్కగా ఫోన్స్ లోనే కొత్త సినిమా చూసుకోవచ్చు. పైగా ఏదైనా సీన్ నచ్చితే మళ్లీ వెనుకకు వెళ్లి ఆ సీన్ పెట్టుకుని మళ్లీ చూడొచ్చు. అలాగే సినిమా ఎన్ని సార్లు అయినా చూడొచ్చు. ఇంతకు మించిన అప్షన్ ఏముంటుంది. అందుకే జనం కూడా స్టార్ హీరో సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. అలాగే అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను జనం బాగా ఆదరిస్తున్నారు.
Also Read: ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లేస్‌లో ఉంటే రెండు వేల కోట్లు సంపాదించే వాడిని: నాగబాబు
కాగా వెబ్ సిరీస్ లు జనంలోకి బాగా వెళ్తుండటంతో ఇప్పుడు హీరోహీరోయిన్లు కూడా డిజిటల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే బడా నిర్మాతలు సైతం కొంతమంది ఫేమస్ నటీనటులతో వెబ్ సిరీస్ లను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది తమిళ నిర్మాతలు కూడా తెలుగు – తమిళంలో ఒకేసారి ఓ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. బబ్లీ బ్యూటీ వరలక్ష్మీ శరత్‌కుమార్ మరియు టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ కలయికలో ఓ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇద్దరి సవతుల మధ్య జరిగే ఎమోషనల్ సిరీస్ అని, ఇందులో హీరోగా మాజీ హీరో మాధవన్ నటిస్తున్నాడని.. సిరీస్ లో కంటెంట్ కాస్త హద్దులు దాటి ఉండబోతుందని.. అలాగే మెయిన్ గా వరలక్ష్మి – ఐశ్వర్య రాజేష్ పాత్రల మధ్య వచ్చే ఆధిపత్య పోరు చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
Also Read: నేటి నటిమణుల్లో ఈ నటి తీరు వేరు !
ఈ సిరీస్ లో కొన్ని సీన్స్ బాగా బోల్డ్ గా ఉన్నా.. అలాగే ఆ సీన్స్ లో కాస్త పరిమితులు దాటి రొమాన్స్ చేయాల్సి వస్తోన్నా.. ఇలాంటి కథాబలం ఉన్న వెబ్ సిరీస్ స్టోరీలో నటిస్తేనే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఐశ్వర్య రాజేష్ ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించారట. ముఖ్యంగా వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని.. అలాగే కథా పరంగా కూడా ఈ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. మరి వరలక్ష్మీకి ఈ సిరీస్ తోనైనా హీరోయిన్ గా సినిమాలు వస్తాయేమో చూడాలి. అన్నట్టు ఈ వెబ్ సిరీస్‌కు తమిళ్ దర్శకుడు సూర్య సుబ్రమణ్యన్ దర్శకత్వం వహించబోతుండగా.. అనంద్ వికటన్ సంస్థ ఈ సిరీస్ ను భారీ స్థాయిలో నిర్మించబోతుంది.