దేశంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ మారిపోయాయి. లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇప్పుడిప్పుడే కొన్ని రంగాలు కోలుకుంటున్నాయి. వలస కార్మికులలు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారంతా సొంతూళ్లకు పయనమయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం కూరగాయలు, నాన్ వెజ్ ధరలకు రెక్కలు రావడంతో తెలంగాణలో కోడి గుడ్డుకు గిరాకీ విపరీతంగా పెరిగింది. సప్లయ్ కి మించి డిమాండ్ ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో కోడిగుడ్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: మరో ట్వీస్ట్: 139మంది రేప్ కేసు.. 36మందికి చేరిన సంఖ్య..!
కరోనా ఎఫెక్ట్ తో ప్రజలంతా ఆరోగ్యంపై దృష్టిసారించారు. వైద్యులు, ప్రభుత్వం తాజా కూరగాయాలు, పండ్లు, నాన్ వెజ్ తిని రోగనిరోధక శక్తి పెంచుకోవాలని సూచిస్తోంది. దీంతో ప్రతీఒక్కరు తాజా కూరగాయలు, పండ్లను తినేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈక్రమంలోనే వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం కూరగాయ ధరలు కిలోకు రూ.70పైబడి ఉంటున్నాయి. చికెన్ తినడం వల్ల కరోనా రాదని సీఎం కేసీఆర్ సైతం చెప్పడంతో కొన్నిరోజులుగా రాష్ట్రంలో చికెన్ ధరలు పెరిగిపోయాయి. చికెన్, చేపలు, మాంసం ధరలు గతంలో కంటే భారీగా పెరిగాయి.
ఇక అందరికీ అందుబాటులో ఉండే కోడిగుడ్లను ప్రజలు ఎక్కువగా తింటున్నారు. సప్లయ్ కి మంచి డిమాండ్ ఉండటంతో కోడిగుడ్లు ప్రజలు అందుబాటులో ఉండలేదని తెలుస్తోంది. గతంలో రాష్ట్రంలో 1.8కోట్ల గుడ్లు అమ్ముడవగా ప్రస్తుతం ఆ సంఖ్య 2కోట్లకు అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ కోడిగుడ్ల వాడకంలో మొదటి స్థానంలో ఉంది. గతంలో రాష్ట్రంలో రోజుకు 3.5కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తికాగా 1.80 కోట్లు స్థానిక అవసరాలకు.. 1.70 కోట్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు.
Also Read: కరోనా: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మళ్లీ ఫైర్
కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం కోడిగుడ్ల ఉత్పత్తి 3కోట్లకు పడిపోయింది. అదే సమయంలో వినియోగం రెండు కోట్లకు పెరిగింది. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో కోడిగుడ్ల వాడకం ఎక్కువైనందునే డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ప్రతీఒక్కరు ఇమ్యూనిటీ పెంచుకునేందుకు కోడిగుడ్లను తినేందుకు ఇష్టపడుతుండటంతో వాటి గిరాకీ పెరిగింది.