https://oktelugu.com/

Bala Krishna: బాలకృష్ణ – గోపిచంద్ సినిమాలో ముఖ్య పాత్ర చేయనున్న… వరలక్ష్మి శరత్ కుమార్

Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ జోష్‏లో ఉన్నాడు. ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బాలయ్య. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకు పోతుంది. అఖండ అందించిన బ్లాక్ బస్టర్ హిట్‏తో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 05:45 PM IST
    Follow us on

    Bala Krishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ జోష్‏లో ఉన్నాడు. ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బాలయ్య. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకు పోతుంది. అఖండ అందించిన బ్లాక్ బస్టర్ హిట్‏తో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 20 నుంచి రెగ్యులర్ షూటింగ్‏కు వెళ్లనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్ నడుస్తుంది.

    vara lakshmi sarath kumar going to play important role in balayya movie

    Also Read: తిరుమల వెంకన్నను దర్శించుకున్న అఖండ మూవీ యూనిట్…

    రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ లీడర్‏గా… పవర్ ఫుల్ పోలీస్‏గా నటించనున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తోండగా ఇప్పుడు మరో హీరోయిన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించనుంది. నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర కాస్త విభిన్నంగా ఉండబోతున్నందట. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు వేటపాలెం అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారట. గతంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రవితేజ క్రాక్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ కలిగిన జయమ్మ పాత్రలో అదరగొట్టింది వరలక్ష్మీ శరత్ కుమార్. మరీ బాలయ్య సినిమాలో వరలక్ష్మీ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

    Also Read: రాయలసీమకు జరుగుతున్న ఆన్యాయమే బాలయ్య కథ !