Jagan Sarkar: ఏపీలో కొనాసగుతున్న సినిమా టికెట్ల వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే హై కోర్టులో జీవో నెంబర్.35 రద్దు చేయడం మీద ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇక కోర్టులో దీనిమీద విచారణ సోమవారానికి వాయిదా పడింది. దీంతో ఆలోగా రిలీజ్ అవుతున్న పుష్ప లాంటి పెద్ద సినిమాలకు మంచి అవకాశం దొరికింది. పాత పద్ధతిలోనే టికెట్లను అమ్ముకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు.
అయితే ఇక్కడే సర్కారు కొరడా విసురుతోంది. పెత్తనం మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకుంటోంది. కోర్టు ఆదేశాల ప్రకారం.. సినిమా టికెట్లను ఎంతకు అమ్ముతున్నారో జాయింట్ కలెక్టర్ల ముందు థియేటర్ల యజమానులు ఉంచాలి. దీన్నే సినిమాటోగ్రఫీ శాఖ అస్త్రంగా మార్చేసుకుంది. ఇందుకోసం జేసీలకు ఆర్డర్ వేసేసింది. సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ చేసేశారు.
ఇందులో థియేటర్ల యజమానులు 17 వరకు కోరిన వినతులను రూల్స్ ప్రకారం వివరిస్తూ తమకు శుక్రవారం 3 గంటలక్లా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ జాయింట్ కలెక్టర్లను ఆ సర్య్కులర్‌లో ఆదేశించారు విశ్వజిత్. నిబంధనల ప్రకారం థియేటర్ ఓనర్లకు అసలు లైసెన్స్ ఉందా.. అనే విషయం మీద స్పష్టంగా పరిశీలించి పూర్తి నివేదికను అందించాలంటూ ఆదేశించారు. దాంతో పాటు ఈ నెలలో 8వ తేదీ నుంచి 17 వ తేదీ దాకా థియేటర్ల యజమానులు ఏమైనా అడ్వాన్స్ గా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేస్తే ఆ విషయాలను కూడా పంపించాలని అందులో ఉంది.
Also Read: MP Raghurama: ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా’.. ఎట్టకేలకు ఆంధ్రాలో దిగిన జగన్ శత్రువు
అంటే జాయింట్ కలెక్టర్లు పంపిన నివేదికలో ఏమైనా లోపాలను ఎత్తి చూపు అవకాశం కూడా ఉంది. అలా ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపితే మాత్రం చివరకు థియేటర్ల యజమానులకు ఇబ్బందులు తప్పవన్నమాట. అంటే జేసీలను మధ్యవర్తులను చేసేసి సర్వాధికారాలను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందన్నమాట. తనిఖీల్లో భాగంగా ఏమైనా లోపాలు ఉంటే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి టికెట్ల రేట్లను పెంచే విషయంలో జేసీలతే తుది నిర్ణయం అని కోర్టు స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ తో వారు నిర్ణయం తీసుకోకముందే తమకు నివేదిక పంపాలని చెప్పడం వల్ల జేసీలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని అడగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.
Also Read: Cheating: షార్ట్ ఫిల్మ్ చేయాలని పిలిచి.. కెమెరాలతో ఉడాయించి..