MP Raghurama: ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా’.. ఎట్టకేలకు ఆంధ్రాలో దిగిన జగన్ శత్రువు

MP Raghurama: ఏపీ గడ్డపై ఎట్టకేలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అడుగుపెట్టారు. అప్పట్లో హైదరాబాద్ లో ఉన్న రఘురామను ఏపీ ప్రభుత్వం సీఐడీ చేత అరెస్ట్ చేయించి జైలుకు పంపి నానా హంగామా చేసింది. ఎలానో కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకున్న రఘురామ ఇక ఏపీ వైపు చూడడానికే భయపడుతున్నాడు. ఢిల్లీలోనే ఉంటూ మీడియాకు తెగ ఇంటర్వ్యూలు ఇస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏపీలోని జగన్ సర్కార్ పక్కలో బల్లెంలా మారిన […]

Written By: NARESH, Updated On : December 17, 2021 6:10 pm
Follow us on

MP Raghurama: ఏపీ గడ్డపై ఎట్టకేలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అడుగుపెట్టారు. అప్పట్లో హైదరాబాద్ లో ఉన్న రఘురామను ఏపీ ప్రభుత్వం సీఐడీ చేత అరెస్ట్ చేయించి జైలుకు పంపి నానా హంగామా చేసింది. ఎలానో కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకున్న రఘురామ ఇక ఏపీ వైపు చూడడానికే భయపడుతున్నాడు. ఢిల్లీలోనే ఉంటూ మీడియాకు తెగ ఇంటర్వ్యూలు ఇస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.

MP Raghurama

ఏపీలోని జగన్ సర్కార్ పక్కలో బల్లెంలా మారిన ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు చాలా రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలి నుంచి అమరావతికి మద్దతిస్తున్న రఘురామ రైతుల పాదయాత్రకు ఆర్థిక సాయం కూడా చేశారు.

Also Read: టీడీపీ ఖ‌జానా ఖాళీ.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లు ఇప్ప‌ట్లో క‌ష్ట‌మే..!

ఇక వైసీపీ నుంచి గెలిచిన ఎంపీ రఘురామ తాజాగా చంద్రబాబు తో అమరావతి తిరుపతి సభలో రాసుకుపూసుకు తిరగడం వైరల్ గా మారింది. ఏపీలో అరెస్ట్ అయ్యాక ఇప్పటివరకూ రఘురామ మళ్లీ ఆంధ్రలో అడుగుపెట్టలేదు. గెలిపించిన సొంత నియోజకవర్గం నరసారావుపేటలోనూ అడుగుపెట్టలేదు. తెలంగాణలో ఉన్నా అరెస్ట్ చేస్తారేమోనని ఢిల్లీలోనే ఉంటున్నారు. ఎట్టకేలకు జగన్ సర్కార్ ఏం చేసినా పర్లేదు అని ధైర్యం చేసి భద్రత నడుమ తిరుపతికి వచ్చారు. తిరుపతి సభలో పాల్గొని వైసీపీ సర్కార్ నే టార్గెట్ చేశారు. నూటికి నూరుశాతం అమరావతియే రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు.

జగన్ దెబ్బకు ఏపీకి రావడమే మానేసిన ఎంపీ రఘురామ తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలివారు. ప్రత్యేక భద్రత ఉన్న రఘురామకు ఏపీ పోలీసులు భద్రత ఇస్తారో ఇవ్వరోనని కేంద్ర బలగాల సాయం కోరారు. ఎట్టకేలకు అమిత్ షా అభయం ఇవ్వడంతోనే ఏపీలో అడుగుపెట్టినట్టు తెలిసింది. ఇలా సొంతగడ్డపై  అడుగుపెట్టడానికి రఘురామ ఎంతగా ఆపసోపాలు పడ్డాడో అర్థం చేసుకోవచ్చు.

Also Read: సారూ.. చాలా బిజీ.. ఐపీఎస్ లతో కూడా మాట్లాడలేదట?

Tags