https://oktelugu.com/

రమ్యకృష్ణ పై వనిత షాకింగ్ ఆరోపణలు !

‘వనితా విజయ్‌కుమార్‌’ ఒంటరి మహిళ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఎవరు ఆమెకు చివరి వరకు తోడును ఇవ్వలేకపోయిన అభాగ్యురాలు. నిజానికి పదిహేను ఏళ్ల క్రితం హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకుని అవకాశాలు రాక మొదటి పెళ్లితో సినిమాలకు దూరం అయింది. అప్పటి నుండి బయట ప్రపంచానికి దూరంగా బతుకుతున్న ఆమె, పర్సనల్ లైఫ్ లోని ఆర్ధిక ఇబ్బందులు కారణంగా మళ్ళీ యాక్టివ్ కావాల్సి వచ్చింది. తమిళ బిగ్‌ బాస్‌ ద్వారా మళ్లీ తెర మీదకు వచ్చి.. అప్పటి […]

Written By:
  • admin
  • , Updated On : July 4, 2021 / 11:23 AM IST
    Follow us on

    ‘వనితా విజయ్‌కుమార్‌’ ఒంటరి మహిళ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఎవరు ఆమెకు చివరి వరకు తోడును ఇవ్వలేకపోయిన అభాగ్యురాలు. నిజానికి పదిహేను ఏళ్ల క్రితం హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకుని అవకాశాలు రాక మొదటి పెళ్లితో సినిమాలకు దూరం అయింది. అప్పటి నుండి బయట ప్రపంచానికి దూరంగా బతుకుతున్న ఆమె, పర్సనల్ లైఫ్ లోని ఆర్ధిక ఇబ్బందులు కారణంగా మళ్ళీ యాక్టివ్ కావాల్సి వచ్చింది.

    తమిళ బిగ్‌ బాస్‌ ద్వారా మళ్లీ తెర మీదకు వచ్చి.. అప్పటి నుండి తరచూ వివాదాలతో నెగిటివ్ కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ నానా రచ్చ చేస్తోంది ఈ సీనియర్ బ్యూటీ. ప్రస్తుతం స్టార్‌ విజయ్‌ టీవీతో తన ప్రయాణం కొనసాగిస్తోన్న ఆమె, తాజాగా ‘బిగ్‌బాస్‌ జోడిగల్‌’ రియాలిటీ షో నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చింది.

    అయితే ఓ సీనియర్‌ నటి కారణంగానే తాను ఆ షోను వీడాల్సి వచ్చిందని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది వనిత. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ షోకి హోస్ట్‌ గా వ్యవహరిస్తోంది సీనియర్ గ్లామరస్ బ్యూటీ రమ్యకృష్ణ. రమ్యకృష్ణను ఉద్దేశించే వనితా ఈ కామెంట్లు చేసిందని అర్ధమైపోతుంది.

    మొత్తానికి ఈ వివాదాన్ని తాజాగా ఓ కోలీవుడ్‌ న్యూస్‌ ఛానెల్‌ రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించగా రమ్యకృష్ణ దానికి సమాధానమిస్తూ.. ‘అసలు షోలో ఏం జరిగిందో ఆమెను మీరు అడిగి ఉండాల్సింది’ అంటూ మ్యాటర్ చెప్పకుండా సింపుల్ గా తేల్చి పారేస్తూ.. ‘నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు.అందుకే దీని పై నో కామెంట్స్‌’ అంటూ రమ్యకృష్ణ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. చివరి ఎపిసోడ్‌లో వనిత పర్‌ ఫార్మెన్స్‌ కు పదికి 1 మార్క్‌ ఇచ్చింది రమ్యకృష్ణ.