https://oktelugu.com/

నయనతార- ప్రభుదేవా సహజీవనంపై ప్రశ్నించలేదేం..

ప్రముఖ నటుడు విజయ్‌ కుమార్ కుమార్తె పెద్ద కూతురు.. నటి వనితా విజయ్‌ కుమార్ ఈ మధ్య తరచూ వార్తల్లో నానుతోంది. ఇటీవలే ఆమె మూడో పెళ్లి చేసుకుంది. ప్రేమించిన పీటర్ పాల్‌ను తన పిల్లల సమక్షంలోనే పెళ్లాడింది. దాంతో, ఆమెపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఏజ్‌లో మూడో పెళ్లి ఏంటి? అంటూ లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరి వంటి సినీ ప్రముఖులు కూడా వనితపై దుమ్మెత్తిపోశారు. సోషల్‌ మీడియాలో తనపై ఘాటు వ్యాఖ్యలు, ట్రోలింగ్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2020 / 04:39 PM IST
    Follow us on


    ప్రముఖ నటుడు విజయ్‌ కుమార్ కుమార్తె పెద్ద కూతురు.. నటి వనితా విజయ్‌ కుమార్ ఈ మధ్య తరచూ వార్తల్లో నానుతోంది. ఇటీవలే ఆమె మూడో పెళ్లి చేసుకుంది. ప్రేమించిన పీటర్ పాల్‌ను తన పిల్లల సమక్షంలోనే పెళ్లాడింది. దాంతో, ఆమెపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఏజ్‌లో మూడో పెళ్లి ఏంటి? అంటూ లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరి వంటి సినీ ప్రముఖులు కూడా వనితపై దుమ్మెత్తిపోశారు. సోషల్‌ మీడియాలో తనపై ఘాటు వ్యాఖ్యలు, ట్రోలింగ్‌ ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. అదే సమయంలో సోషల్‌ మీడియా వేదికగా విమర్శకులకు గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది వనిత.

    అంతవరకు బాగానే ఉన్నా తన పెళ్లి వ్యవహారంలోకి నయనతారను కూడా లాగిందామె. సౌత్‌లో లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న నయన్‌ వ్యక్తిగత జీవితంపై అనవసర కామెంట్లు చేసి మరిన్ని చిక్కులు కొనితెచ్చుకుంది.

    Also Read:బాలీవుడా అండర్ వరల్డా?

    తన మూడో పెళ్లి గురించి ప్రశ్నించే వారికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా- నయన్‌లా ప్రేమ వ్యవహారాన్ని ఎత్తి చూపిందామె. ప్రభుదేవా కూడా గతంలో తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే నయన తారతో సహజీవనం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ కారణంగా ప్రభుదేవా భార్య రమాలత, ముగ్గురు పిల్లలు ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పింది. కానీ, అప్పట్లో ఈ విషయంపై ఒక్క మాట మాట్లాడని వారు, తన మూడో పెళ్లి గురించి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వనితా చెప్పినదానిలో లాజిక్‌ ఉన్నా… అనవసర టైమ్‌లో, అనవసర విషయంలోకి నయన్‌ను లాగి తేనెతుట్టిని కుదిపిందామె. అంతే.. నయన్‌ ఫ్యాన్స్‌ అంతెత్తున లేశారు. మీ వ్యక్తిగత విషయంలోకి నయన్‌ను ఎందుకు తీసుకొస్తారని వనితపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమెపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌ చేస్తున్నారు. కొంత వరకూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసిన వనిత.. నయన్‌ ఫ్యాన్స్‌ ధాటిని తట్టుకోలేకపోయింది. చివరకు నయన్‌- ప్రభుదేవ గురించి చేసిన ట్వీట్లను డిలీట్‌ చేసింది. అయినా.. వాళ్ల ఫ్యాన్స్‌ శాంతిచలేదు. చివరకు తన ట్విట్టర్ఖాతానే డీయాక్టివేట్‌ చేసింది వనిత.

    Also Read: హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో కాజల్‌!