బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడని ఇన్నాళ్లు ఫిల్మ్ గ్రూప్స్ తరుచూ ప్రోజెట్ చేస్తూ వచ్చాయి. కానీ ప్రభాస్ అందరూ అనుకున్నట్లు పాన్ ఇండియా స్టార్ కాదు, యూనివర్సల్ స్టార్. అవును ప్రభాస్ రేంజ్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పాకిపోయింది. ఒక తెలుగు హీరోకి జపాన్ మరియు రష్యా లాంటి దేశాల్లో కూడా ఫ్యాన్స్ క్రియేట్ అవుతారని బహుశా ఎవ్వరూ ఉహించి ఉండరు. ప్రత్యేకంగా జపాన్ లో ప్రభాస్ అంటే.. ఓ స్టార్ హీరో. ఎప్పుడో రజినీకాంత్ గురించి ఇలా చెప్పుకుంటుంటాం.. కానీ ప్రభాస్, రజినిని కూడా మించిపోయాడు. జపాన్ విధుల్లోని దుకాణాలలో ప్రభాస్ ఫొటోలతో తయారుచేసిన టాయ్స్ ను అమ్ముతున్నారంటే.. అక్కడ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ఇక ప్రత్యేక కథనాలు ఆక్కర్లేదు. ప్రభాస్ గ్లోబల్ స్టార్ అని తీర్మాణం చేసేయచ్చు. పైగా ఇప్పుడు ప్రభాస్ సాహో క్రియేట్ చేసిన రికార్డ్స్ కూడా అందుకు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Also Read: నయనతార- ప్రభుదేవా సహజీవనంపై ప్రశ్నించలేదేం..
తాజాగా సాహో జపనీస్ వర్షన్ అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి ఇండియన్ సినిమాగా నిలవడం టాలీవుడ్ కే గర్వకారణం. ఇంతకుముందు వరకూ ఈ రికార్డ్ అమీర్ ఖాన్ దంగల్ పేరు మీద ఉండేది. కానీ సాహో దానిని అధిగమించి.. జపాన్ ప్రేక్షకులకు ప్రభాస్ ను మరింతగా దగ్గరచేసింది. ఇప్పుడు ప్రభాస్ కి యూనివర్సల్ వైడ్ గా మార్కెట్ క్రియేట్ అయింది. పైగా జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఐదు ఇండియన్ సినిమాలలో ప్రభాస్ సినిమాలు రెండు ఉండటం నిజంగా గొప్పే. టాప్ ఐదు సినిమాలు చూసుకుంటే… సాహో, దంగల్, ఇంగ్లీష్ వింగ్లీష్, 3 ఇడియట్స్, ముత్తు మరియు బాహుబలి 2 సినిమాలు ఉన్నాయి. ఏమైనా టాప్ ఫైవ్ లో ఇంకా రజిని ముత్తు సినిమా నిలవడం విషయమే. కానీ జపాన్ లో ప్రస్తుతం నెం.1 ఇండియన్ హీరో మాత్రం ప్రభాసే.
Also Read: ‘రైడ్’కు రెడీ అవుతున్న నాగార్జున!
ప్రస్తుతం ప్రభాస్, ‘జిల్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ దర్సకత్వంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో.. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ఓ భారీ సినిమాని కూడా చేయబోతున్నాడు. ఇక వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకున్నే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టు తెలుస్తోంది.