Vanitha Vijay Kumar: ‘వనిత విజయ్ కుమార్..’ వరుస పెళ్లిల రాకుమారి అని ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే ‘వనిత చేసిన సినిమాల కంటే చేసుకున్న పెళ్లిళ్లు ఎక్కువ. ఏది ఏమైనా మూడు పెళ్లిళ్లు, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, మధ్య మధ్యలో ఎమోషనల్ అవుతూ తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం.. క్లుప్తంగా చప్పుకుంటే ఇది వనిత విజయ్ కుమార్ జీవిన విధానం.

అయితే, వనిత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన నిజాలు బయట పెట్టింది. ‘మా అమ్మ చనిపోయాక ఆస్తుల్లో నాకు చిల్లిగవ్వ కూడా దక్కకూడదని తండ్రి అనుకున్నాడని కోలీవుడ్ నటి వనితా విజయ్‌కుమార్ అన్నారు. పాతతరం నటులు మంజుల-విజయ్‌కుమార్‌ల పెద్ద కూతురైన ఆమె.. ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను చెప్పుకున్నారు.
Also Read: కరోనా కరుణిస్తే.. మే 20న వస్తాం !
తనకు తమిళనాడులో అడ్రస్ లేకుండా చేస్తానని నాన్న ఛాలెంజ్ చేశాడని తెలిపారు. ఇంట్లో నుంచి తనను గెంటేశాడని చెప్పారు. కాగా, ఈమె మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి ‘నా తండ్రే నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు..’ అంటూ వనిత తన బాధను పబ్లిక్ గా చెప్పుకుని మరింతగా బాధ పడింది.
అన్నట్టు ఈ బ్యూటీ తాజాగా మళ్ళీ పెళ్లి పై పాజిటివ్ కామెంట్స్ చేసింది. ఏది ఏమైనా వనితలో ఇంకా పెళ్లి ఆలోచనలు ఉన్నట్టు ఉన్నాయి. లేకపోతే ఇలా బాధలో కూడా పెళ్లి గురించి పాజిటివ్ గా ఎందుకు మాట్లాడుతుంది. పాపం వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు వైఫల్యాలతో వనిత, ప్రొఫెషనల్ గాను కెరీర్ లో ఎదగలేకపోయింది. దీనికి తోడు ఇప్పటికే చేసుకున్న మూడు పెళ్లిళ్లు ఆమెకు కన్నీళ్లే మిగిల్చాయి.
Also Read: ధోని, తమిళ హీరో విక్రమ్ కలయికలో ఆంతర్యమేమిటి?
[…] […]