Pakka Commercial Release Date: హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’. మారుతీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై యూనిట్ ప్రకటన చేసింది. ‘మే 20న వస్తున్నాం.. కరోనా కరుణిస్తే..’ అంటూ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేసింది. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, అనసూయ, రావు రమేష్, సప్తగిరి కీలకపాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక హీరో గోపీచంద్ కి ఎలాగైనా హిట్ సినిమా ఇవ్వాలనే కసితో తన క్రియేటివిటీని అంతా గుమ్మరిస్తూ సినిమా చేస్తున్నాడు మారుతి.

కాగా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ తమ కలయికలో వస్తున్న “పక్కా కమర్షియల్ ” సినిమా పై మొత్తానికి ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన ఈ “పక్కా కమర్షియల్ ” టైటిల్ సాంగ్ ప్రోమో అండ్ టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా కోసమే మారుతి ‘పక్కా కమర్షియల్’ గా స్క్రిప్ట్ రాశాడట.
Also Read: ధోని, తమిళ హీరో విక్రమ్ కలయికలో ఆంతర్యమేమిటి?
మారుతి నుండి మాత్రం మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు, ఇప్పటికే మారుతి ఈ సినిమా విషయంలో వినోదం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చాడు. అయినా అల్లు అరవింద్ కంపెనీ నుండి సినిమా వస్తుందంటే చెప్పాల్సిన పనే లేదు. కాబట్టి ఈ సారి గోపీచంద్ కి మంచి విజయం దక్కుతుందని అనుకోవచ్చు. కాకపోతే, హీరో గోపీచంద్ కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది. వరుస పరాజయాలతో విసిగిపోయాడు.
కాకపోతే, ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు బాగా అలరిస్తున్నాయి కాబట్టి.. ముఖ్యంగా గోపీచంద్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి కాబట్టి.. ఇది బాగా వర్కౌట్ అవ్వొచ్చు.
Also Read: రిలీజ్ డేట్లు వస్తున్నాయ్.. చిరంజీవి చెప్పిన మంచిరోజులు ఏమైనట్టు..?
[…] Also Read: కరోనా కరుణిస్తే.. మే 20న వస్తాం ! […]
[…] Also Read: కరోనా కరుణిస్తే.. మే 20న వస్తాం ! […]