టాలీవుడ్ తెరపై ‘వకీల్ సాబ్’ ప్రభంజనం కొనసాగుతోంది. ఏప్రిల్ 9న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ఈ మూవీని చూసి పవన్ నట విశ్వరూపానికి ఫిదా అవుతున్నారు. మూడేళ్ల తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కు అదిరిపోయే సినిమా పడిందంటున్నారు. పవన్ కమ్ బ్యాక్ మూవీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ‘వకీల్ సాబ్’ మేనియా నడుస్తోంది. ఈ సినిమా కోసం సామాన్యులే కాదు.. కొందరు సెలబ్రిటీలు సైతం అదే రీతిలో ఎదురుచూసి చూస్తున్నారు. ట్వీట్లు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య సఖ్యత లేదన్న ప్రచారాన్ని కొట్టిపడేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా పవన్ నటించిన ‘వకీల్ సాబ్’ను చూశాడు. ఈ మూవీపై రివ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా పవన్ పై ఊహించని కామెంట్స్ చేశాడు.
‘వకీల్ సాబ్ లో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ గా నటించాడు. సరైన కమ్ బ్యాక్ ఇది. అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టేశాడు. అతడికి నా శుభాకాంక్షలు’ అని మహేష్ ట్వీట్ చేశాడు. ఇక ఇతర సినిమా సిబ్బంది, నటీనటుల గురించి కూడా మహేష్ ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.
‘ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ నటన అద్భుతంగా ఉంది. అలాగే, నివేదా, అంజలి, అనన్యల నటన గుండెలకు హత్తుకునేలా ఉంది. థమన్ తన సంగీతంతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. దిల్ రాజు, వేణు శ్రీరామ్, పీఎస్ వినోద్, బోనీకపూర్ సహా చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు’ అంటూ మహేష్ ట్వీట్ చేసి వకీల్ సాబ్ టీంను ఉత్సాహపరిచాడు.
https://twitter.com/urstrulyMahesh/status/1380938634354782212?s=20
ఇన్నాళ్లు స్టార్ హీరోల మధ్య ఇలాంటి వాతావరణం లేకుండేది. కానీ ఇప్పుడు సహృదయంతో మహేష్ బాబు ట్వీట్ చేయడం అటు పవన్ ఫ్యాన్స్ ను.. ఇటు మహేష్ ఫ్యాన్స్ ను కూడా ఆనందంలో ముంచెత్తింది.