https://oktelugu.com/

ఆర్నబ్‌ కు దొరకని సానుభూతి! ఇప్పటికైనా మారాల్సిందేనా?

ఓ ఇంటీరియర్‌‌ డిజైనర్‌‌ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించాడన్న నెపంతో రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌‌ ఇన్‌ చీఫ్‌ ఆర్నాబ్‌ గోస్వామిని అరెస్ట్‌ చేశారు. ఆయన అరెస్టుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నుంచి బీజేపీ నేత వరకూ స్పందించారు. ఖండించారు కూడా. మహారాష్ట్రలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం ఉందని మండిపడ్డారు. ఈ స్పందనలు చూసి సోషల్ మీడియాలో ఓ ట్రోలింగ్‌ నడుస్తోంది. మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్ ఆర్నాబ్ గోస్వామి జర్నలిస్టా లేకపోతే..  బీజేపీ నేతా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 / 01:04 PM IST
    Follow us on

    ఓ ఇంటీరియర్‌‌ డిజైనర్‌‌ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించాడన్న నెపంతో రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌‌ ఇన్‌ చీఫ్‌ ఆర్నాబ్‌ గోస్వామిని అరెస్ట్‌ చేశారు. ఆయన అరెస్టుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నుంచి బీజేపీ నేత వరకూ స్పందించారు. ఖండించారు కూడా. మహారాష్ట్రలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం ఉందని మండిపడ్డారు. ఈ స్పందనలు చూసి సోషల్ మీడియాలో ఓ ట్రోలింగ్‌ నడుస్తోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ఆర్నాబ్ గోస్వామి జర్నలిస్టా లేకపోతే..  బీజేపీ నేతా అని అందరూ ట్రోల్‌ నడిపిస్తున్నారు. సాధారణంగా జర్నలిస్టు అనే వారిపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడితే అటు మీడియా ప్రపంచం మొత్తం.. ఇటు రాజకీయ నేతలు అందరూ మద్దతుగా నిలుస్తారు. కానీ ఆర్నాబ్ విషయంలో  బీజేపీ నేతలు తప్ప ఏ ఒక్కరూ మద్దతుగా స్పందించలేదు.

    Also Read: చంద్రబాబు బాటలో కేరళ సీఎం.. మోడీకి షాక్

    జర్నలిజంలో ఆర్నాబ్.. ఆయన స్టైల్‌ డిఫరెంట్‌. చాలా వరకు మీడియాలు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తుంటాయి. అలాగని ఇతర పార్టీలపై అనుచితమైన వార్తా కథనాలు ఏం ప్రసారం చేయవు. కానీ.. ఆర్నాబ్‌ మాత్రం అందుకు భిన్నం. అచ్చం బీజేపీ సోషల్ మీడియా స్టైల్‌లోనే విరుచుకుపడుతుంటారు. ఆ స్థాయిలోనే టీవీ చానల్ స్టోరీస్ ప్రసారం చేస్తుంటారు. విపక్షాలన్నింటినీ పాకిస్థాన్ మద్దతుదారులుగా చెప్పడానికీ ఆయన వెనుకాడరు. అందుకే.. ఆయనకు మీడియాలోనూ పెద్దగా మద్దతు లభించలేదు.

    Also Read: అమెరికా అధ్యక్షుడిగా ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు?

    నిన్నటి రోజున స్వయంగా ఆర్నాబ్‌ ఇంటికొచ్చి పోలీసులు అరెస్టు చేసినా.. ఎడిటర్స్‌ గిల్డ్‌ కూడా పెద్దగా స్పందించలేదు. కేవలం ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసి తమ పనిని పూర్తిచేశాయి. బీజేపీ వారు మాత్రం ఖండించారు. అందుకే.. జర్నలిస్టులు అనే వారు తమ పనిని తాము చేసుకుపోవాలి తప్ప.. ఒక వర్గం.. ఒక పార్టీకి వంత పాడితే పరిస్థితులు ఇలానే ఉంటాయనేది స్పష్టం అవుతోంది.